Explainer: గ్రీన్ ల్యాండ్ స్వయంగా లొంగిపోతుందా? ట్రంప్ ఆపరేషన్ అవసరం ఉండదా? ఏం జరగబోతోంది?

వెనెజువెలా పని అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ ల్యాండ్ అని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అప్పటి నుంచి  ప్రతి ఒక్కరూ అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటుందో అని ఆలోచిస్తున్నారు. ఆ దేశమే స్వయంగా లొంగిపోతుందా అని అంచనాలేస్తున్నారు. 

New Update
greenland

వెనెజువెలా తర్వాత గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీని కోసం మిలటరీని కూడా వినియోగించేందుకు కూడా సిద్ధమైంది ట్రంప్ యంత్రాంగం. అర్కిటిక్‌లో భౌగోళిక రాజకీయ పోటీ పెరగడంతో గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడాన్ని ట్రంప్‌ అమెరికా జాతీయ భద్రత ప్రాధాన్యతగా చూస్తున్నారని తెలిపింది. దీనిపై ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోంది. వెనెజులా విషయంలో చెప్పినట్టు చేసిన ట్రంప్...గ్రీన్ ల్యాండ్ విషయంలో కూడా చేస్తారని అంటోంది. అలాగే ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుంది అనే దానిపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు. గ్రీన్ ల్యాండే స్వయంగా లొంగిపోతుందా? ట్రంప్ మిలటరీ ఆపరేషన్ అవసరం ఉండదా అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  అట్లాంటిక్ లో రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్..ఛేజ్ చేసి పట్టుకున్న అమెరికా దళాలు

కచ్చితంగా స్వాధీనం చేసుకుంటుంది..

డెన్మార్క్‌ భూభాగంలో ఉన్న గ్రీన్‌లాండ్(Greenland) అనేది స్వయంప్రతిపత్తి కలిగిన దీవి. మొత్తం సహజవనరులతో నిండి ఉంటుంది. ఇక్కడ కేవలం 57 వేల మంది నివసిస్తున్నారు.  గతంలో కూడా అమెరికా ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ డెన్మార్క్ వాటిని కొనసాగనివ్వలేదు. ఈ ద్వీపాన్ని ఎవరికీ అమ్మేది లేదని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ట్రంప్‌ దీనిగురించి పట్టు ప్టుకుని కూర్చొన్నారు. వెనెజువెలా విషయంలో ట్రంప్ యాక్షన్స్ ను చూశాక.. ప్రస్తుతం డెన్మార్క్‌, గ్రీన్ ల్యాండ్ కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశం కావాలని కోరుకుంటోంది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి చర్చిండమే ఈ సమావేశం ఉద్దేశమని విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్డ్ చెబుతున్నా...గ్రీన్ ల్యాండ్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

గ్రీన్ ల్యాండ్ పై అమెరికా కన్ను ఎందుకు?

యఎస్(usa) కు గ్రీన్లాండ్ స్థానం చాలా కీలకం.  అమెరికా, యూరప్,  రష్యా మధ్యన ఇది ఉంటుంది. దీంతో వ్యూహాత్మకంగానే కాక ఇది చాలా కాలంగా అమెరికన్ భద్రతకు కీలకమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే గ్రీన్ ల్యాండ్ సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. చమురు, గ్యాస్, అరుదైన  లోహాలతో ఫుల్ గా నిండి ఉంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనా ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది అమెరికాపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ అరుదైన భూమి ఖనిజాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయి. దాంతో పాటూ  యునైటెడ్ స్టేట్స్ వాటిపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటోంది. ఇక వాతావరణ మార్పు విషయానికి వస్తే.. ఇక్కడి ఆర్కిటిక్ మంచును కరిగించడంతో ఉత్తర షిప్పింగ్ మార్గాలు ఏడాది పొడవునా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని మరింత ముఖ్యమైనవిగా చేస్తాయి. అందుకే గ్రీన్ ల్యాండ్ విషయంలో అమెరికా, ట్రంప్ అంత పట్టుదలగా ఉన్నారు. 

Also Read :  తనకే దిక్కులేని పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు ఫైటర్ జెట్లు ఇస్తానని ఒప్పందం

గ్రీన్ ల్యాండ్ ఏం చేయబోతోంది?

అమెరికా అయితే గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడం కన్ఫార్మ్ అని చెబుతోంది. అది ఎంత తొందరలో జరుగుతుంది అనేది ఇంకా స్పష్టం చేయకపోయినప్పటికీ..కచ్చితం అని మాత్రం అంటోంది. దీనికి సంబంధించి గ్రీన్ ల్యాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది అని కూడా తెలుస్తోంది. మరోవైపు గ్రీన్ ల్యాండ్ కూడా దీనికి సముఖంగా ఉందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ప్రజలు చాలా రోజుల నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. డానిష్ సామ్రాజ్యం, వలస వారసత్వం నుంచి విముక్తిని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా ప్రతిపాదన వారికి లాభించవచ్చని చెబుతున్నారు. వారి స్వాతంత్రానికి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని అంటున్నారు. గ్రీన్ ల్యాండ్ ను అమెరికాకు అప్పగించడానికి కూడా డెన్మార్కే ఎప్పటి నుంచో అడ్డుపడుతోంది. 1953 నుండి డెన్మార్క్‌తో యూనియన్‌గా ఉంది. 2009లో, ఇది దాని స్వంత స్వయంప్రతిపత్తి ప్రభుత్వాన్ని స్థాపించింది, కానీ డెన్మార్క్ విదేశాంగ వ్యవహారాలు, భద్రత, రక్షణ మరియు ద్రవ్య విధానాన్ని పర్యవేక్షిస్తుంది.

అయితే ప్రస్తుతానికి గ్రీన్ ల్యాండ్ ప్రధాన మంత్రి మాత్రం వెనెజువెలా సైనిక చర్యలను దృష్టిలో పెట్టుకుని తమ దేశం గురించి మాట్లాడడం బాలేదని...అది తమకు అవమానమని చెప్పారు. కానీ ఈ విషయంపై అమెరికాతో తప్పకుండా చర్చలు జరుపుతామని అన్నారు. వారు సరైన మార్గాల ద్వారా మాట్లాడాలి...చట్టాన్ని గౌరవించాలని చెప్పారు. అంతే కాని పూర్తిగా విషయాన్ని తోసిపుచ్చలేదు. మరోవైపు గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకోవడం అమెరికాకు అంత పెద్ద విషయమే కాదు. ఆ విషయం గ్రీన్ ల్యాండ్ కు కూడా తెలుసు. అందుకే తమ దేశం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనంతటినీ బట్టి చూస్తే...అమెరికాకు గ్రీన్ ల్యాండ్ సులభంగా దక్కుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

#telugu-news #usa #latest-telugu-news #today-latest-news-in-telugu #international news in telugu #Venezuela #Greenland
Advertisment
తాజా కథనాలు