/rtv/media/media_files/2026/01/07/oil-tank-2026-01-07-21-30-56.jpg)
ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యాకు చెందిన ‘మరినేరా’ అనే ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా దళాలు వెంబడించి స్వాధీనం చేసుకున్నాయి. రెండు వారాలకు పైగా దీన్ని అమెరికా సైన్యం వెంబడించి మరీ పట్టుకుంది. వాషింగ్టన్ ఆంక్షలను ఉల్లంఘించినందుకే ట్యాంకర్‌ను సీజ్ చేసినట్లు అమెరికా సైన్యం యూరోపియన్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ను జస్టిస్, హోంల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా చేపట్టాయి. అమెరికాను రక్షించడానికి ప్రభుత్వం విధానం తెలియజేస్తుంది అంటూ పోస్ట్ లో రాసింది. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ కు రక్షణగా రష్యా నౌకా దళాలను మోహరించిందని వార్తలు వస్తున్నాయి. కానీ రష్యా, అమెరికా దళాల మధ్య ఎటువంటి ఘర్షణ మాత్రం జరగలేదు.
BREAKING WORLD EXCLUSIVE: RT obtains FIRST footage of Russian-flagged civilian Marinera tanker being CHASED by US Coast Guard warship in the North Atlantic https://t.co/sNbqJkm5O5pic.twitter.com/XtbBML3a6j
— RT (@RT_com) January 6, 2026
చాలా రోజుల నుంచీ నిషేధం..
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై ఈ నౌకను అమెరికా 2024లో నిషేధించింది. గతంలో దీన్ని బెల్లా 1గా పిలిచేవారు. ఇది ఇరాన్ నుంచి వెనిజులాకు వెళ్తూ ఆమెరికా ఆంక్షల నేపథ్యంలో అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ తరువాత మరినేరాగా పేరు మార్చుకుని, రష్యా జెండాతో అట్లాంటిక్ తో తిరుగుతోంది.ఆ నౌకను రష్యా అధికారిక షిప్పింగ్ రిజిస్ట్రీలో కూడా చేర్చారు. దానినే ఇప్పుడు అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ నౌక స్వాధీనంపై రష్యా అధికారిక టెలివిజన్ విడుదల చేసింది. ట్యాంకర్‌ను హెలికాప్టర్ సమీపిస్తున్నట్లు రెండు అస్పష్టమైన ఫోటోలను రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా, అమెరికా కోస్ట్ గార్డ్ లాటిన్ అమెరికా జలాల్లో వెనుజులాకు సంబంధించిన మరో ట్యాంకర్‌ను కూడా అడ్డుకున్నట్టు రాయిటర్స్ నివేదించింది.
Follow Us