BIG BREAKING: భారత్ కు బిగ్ రిలీఫ్.. సుంకాలపై కాస్త వెనక్కు తగ్గిన ట్రంప్.. కీలక ప్రకటన!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై కాస్త వెనక్కు తగ్గారు.  ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాల గురించి ఆలోచించడం లేదని అన్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన తర్వాత ట్రంప్..ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
trump tariff

Trump about Tariffs

మొత్తానికి భారత్ పై విధించిన అదనపు సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు నోరు విప్పారు. ఈరోజు పుతిన్ తో జరిగిన సమావేశం తర్వాత ఆయన దీని గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడితో చర్చలు సఫలం అయ్యాయని..అయితే ఎటువంటి ఒప్పందాలు జరగలేదని చెప్పారు. మరికొన్ని రోజుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, పుతిన్ కలుస్తారని...అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారని తెలిపారు. దీంతో పాటూ అమెరికా విధించిన అదనపు సుంకాల గురించి కూడా మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఇప్పుడు కొత్త సుంకాలు విధించడాన్ని తాను పరిగణించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. మరో రెండు లేదా మూడు వారాల్లో ఈ అంశాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. 

భారత్ పై అదనపు సుకా వల్లనే రష్యాతో చర్చలు..

ఈరోజు జరిగిన మీటింగ్ కారణంగా టారీఫ్ ల విషయం తాను కాస్త పక్కన పెట్టానని చెప్పారు ట్రంప్, పాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బహుశా రెండు లేదా మూడు వారాల్లో సుంకాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అన్నారు. భారత్ పై తాను విధించిన అదనపు సుంకాల వల్లనే రష్యాతో సమావేశం జరిగేలా ప్రేరేపించిందని చెప్పారు. తాను సుంకాలను విధించినందు వల్ల భారత్...రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాల్సి వచ్చిందని..అది ఆ దేశంపై వత్తిడి తీసుకువచ్చిందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా అతి పెద్ద వినియోగదారుడని...చైనాకు చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ చెప్పిన దానిబట్టి భారత్ పై అదనపు సుంకాలు అమలు అవుతాయా లేదా అని తెలియాలంటే ఆగస్టు 27 వరకు వెయిట్ చేయాల్సిందే. ట్రంప్ పున:సమీక్షిస్తామని చెప్పారు కానీ..కచ్చితంగా ఆపేస్తున్నామని చెప్పకపోవడమే దీనికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.  

కొనుగోళ్లు కొనసాగుతున్నాయి..

అయితే భారత్ వెర్షన్ మరోలా ఉంది. ట్రంప్ బెదిరింపులకు తాము లొంగలేదని..రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయలేదని మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎఎస్ సాహ్ని ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. ఆర్థిక కారణాల వల్ల రష్యా నుంచే చమురును కొనుగోలు చేస్తామని.. అవి ముందు ముందు కూడా కొనసాగుతాయని ఆయన తెలిపారు. 

Also Read: Trump: మేం మాట్లాడుకోవడం అయిపోయింది..ఇంక అంతా జెలెన్ స్కీ చేతుల్లోనే..

Advertisment
తాజా కథనాలు