/rtv/media/media_files/2025/09/25/reliance-industries-2025-09-25-19-13-54.jpg)
Reliance Industries
ప్రముఖ పారిశ్రామిక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఫుడ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కోసం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాపారంలో భాగంగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో కూడా ఓ పరిశ్రమను ఏర్పాటుచేయనుంది రిలయన్స్.
Also Read: పహల్గాం ఉగ్రదాడిపై కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు సాయం చేసిన నిందితుడు అరెస్టు
అయితే ఇప్పటికే రిలయన్స్ వివిధ వ్యాపారాల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆహార పరిశ్రమ రంగంలోకి కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల ఓ సమావేశంలో పెట్టుబడులకు సంబంధించి తమ ప్లాన్‌ను బయటపెట్టింది. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు అందులో వివరించింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంతో కూడా ఈ విషయంపై ఒప్పందం చేసుకుంది. ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన కటోల్‌లో ఫుడ్, బేవరేజెస్ యూనిట్లను రూ.1500 కోట్లతో ఏర్పాటు చేయనుంది.
Also Read: 1,500 ఈగలు, 75 ఎలుకలను అంతరిక్షంలోకి పంపిన రష్యా.. ఎందుకో తెలుసా?
ఇదిలాఉండగా కన్జూమర్ వ్యాపార విభాగంలో కూడా రిలయన్స్ తనకంటూ గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కాంపా, ఇండిపెండెన్స్ పేరుతో కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్స్, ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అమ్ముతోంది. అలాగే ఇతర కన్జూమర్ ప్రొడక్టులు కూడా తీసుకొచ్చేందుకు ట్యాగ్స్ ఫుడ్స్ వంటి బ్రాండులను కొనుగోలు చేసింది రిలయన్స్. ఇక రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు.
Also Read: పుణె యూనివర్సిటీకి రూ.2.46 కోట్ల కుచ్చుటోపీ.. తెలుగు ఇంజినీర్ అరెస్టు
అంతేకాదు దేశంలోనే అతిపెద్ద FMGC కంపెనీగా ఏర్పాటు చేయడంతో పాటు దీన్ని విదేశాలకు విస్తరించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇతర కన్జూమర్ కేటగిరీల్లో తమ సంస్థను విస్తరించేందుకు బ్లూప్రింట్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు.
ET EXCLUSIVE: Reliance Consumer is set to establish its first food park in Kurnool, Andhra Pradesh with an investment of ₹768 crore as part of its ambitious ₹40,000 crore consumer rollout. Strategically located near Hyderabad and Bengaluru, it will serve as a hub for South… pic.twitter.com/0CxOd3QBuI
— Nidhi (@nidhi_sharma) September 21, 2025