Rishi Sunak: అప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగిగా రిషి సునాక్‌

బ్రిటన్‌కు రెండేళ్ల పాటు సేవలు అందించిన రిషి సునాక్‌.. ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, అలాగే ఆంత్రోపిక్ అనే ఏఐ స్టార్టప్‌ కంపెనీలో సీనియర్‌ అడ్వైజర్‌గా చేరారు.

New Update
Former British PM Rishi Sunak joins Microsoft, Anthropic in advisory roles

Former British PM Rishi Sunak joins Microsoft, Anthropic in advisory roles

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్‌(rishi-sunak) గురించి అందరికి తెలిసిందే. 2022లో భారత సంతతికి చెందిన వ్యక్తిగా బ్రిటన్‌ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడంతో ఆయన ఆ పదవి నుంచి దిగిపోయారు. కానీ ఎంపీగా మాత్రం గెలిచారు. ఇక లేబర్‌ పార్టీ అధికారంలోకి రావడంతో కీర్‌ స్టార్మర్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌కు రెండేళ్ల పాటు సేవలు అందించిన రిషి సునాక్‌.. ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, అలాగే ఆంత్రోపిక్ అనే ఏఐ స్టార్టప్‌ కంపెనీలో సీనియర్‌ అడ్వైజర్‌గా చేరారు. 

Also Read: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని

Former British PM Rishi Sunak Joins Microsoft

రిషి సునాక్ సాంకేతికత, సమాజంపై స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయాల్లో జరిగే అంశాలు, వాటి ప్రభావం గురించి వ్యూహాత్మక మార్గదర్శకాలను అందిస్తారు. ఆయన ఈ బాధ్యతలు నిర్వహించేందుకు యూకే అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్‌మెంట్స్‌ (ACOBA) నుంచి ఆమోదం లభించింది. కానీ ఒక షరతు పెట్టింది. దీని ప్రకారం సునాక్‌.. రెండేళ్లు పాటు యూకే ప్రభుత్వ మంత్రులను లాబీయింగ్ చేయడం లేదా ఈ కంపెనీలకు యూకే ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించడంలో సాయం చేయకూడదు. 

Also Read: శబరిమల బంగారం స్కామ్‌లో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

యూకే(united-kingdom) ప్రధానిగా ఉన్న సమయంలో రిషి సునాక్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలను ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు గతంలో గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అనే కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవలే ఆ సంస్థలో సీనియర్‌ రోల్‌ తీసుకున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుడిగా చేరారు. ఆంత్రోపిక్‌ను 2021లో ఓపెన్‌ ఏఐకి పోటీగా స్థాపించారు.   

Advertisment
తాజా కథనాలు