Medical Student : వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని

వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో  చదువుతోంది.

New Update
medical

వెస్ట్ బెంగాల్(west bengal) లో మరో దారుణం జరిగింది. మరో మెడికల్ స్టూడెంట్(medical-student) అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఒడిశాకు చెందిన బాధితురాలు..శోభాపూర్ కాలేజీలో  చదువుతోంది. అయితే నిన్న తన మిత్రుడితో  కలిసి రాత్రి 8 గంటలకు తినేందుకు బయటకు వెళ్తుండగా..  క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

Also Read :  ఈ బంగారం కేవలం రూ.10 వేలే.. వెంటనే ఆ ఆభరణాలు చేయించుకోండి!

బాధితురాలి ఫోన్ కూడా

రెండవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఆమె ఒక స్నేహితుడి కోరిక మేరకు ఆహారం కోసం క్యాంపస్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా, గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆమెను సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫోన్ కూడా లాక్కెళ్లారు.

ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలి తల్లి చెబుతుంది.  ఆమెతో వెళ్లిన అబ్బాయి ఆమెను తిరిగి తీసుకువచ్చాడని తెలిపింది.  కాగా 2024లో  వెస్ట్ బెంగాల్ లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన RG కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Also Read :  శబరిమల బంగారం స్కామ్‌లో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు