Sabarimala: శబరిమల బంగారం స్కామ్‌లో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

శబరిమల ఆలయం నుంచి 474.90 గ్రాముల బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

New Update
Sabarimala temple

Sabarimala

కేరళలోని శబరిమల ఆలయం బంగారం స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. శబరిమల ఆలయం నుంచి 474.90 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు వెల్లడైంది. ఈ వివాదం తీవ్రం కావడంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చూడండి: Premanand Maharaj : అనారోగ్యానికి గురైన ప్రేమానంద్‌ మహారాజ్... పెదవులు వాచిపోయి

దర్యాప్తు నివేదిక ఆరు వారాల్లోగా సమర్పించాలని..

ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) విజిలెన్స్ బ్రాంచ్ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బంగారం మిస్సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఆదేశించింది. అయితే బంగారం మిస్సింగ్ అయినట్లు నిర్ధారించిన తర్వాత న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్ వి, కెవి జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే మాయం అయిన ఈ బంగారం మొత్తం విలువ రూ.55 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తోంది. 

ఇది కూడా చూడండి: Sabarimala: శబరిమల ఆలయంలో మరో గోల్డ్ స్కామ్.. అమూల్యమైన పవిత్ర దండం మిస్సింగ్!

దీంతో పాటు మరో స్కామ్ కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. 2019లో అప్పటి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ. పద్మకుమార్ కుమారుడు జయశంకర్ పద్మకుమార్... అయ్యప్పకు ఉపయోగించే'యోగ దండ', 'రుద్రాక్ష' పూసల గొలుసును తగిన నియమాలు పాటించకుండా బంగారు పూత పూయించినట్లు దర్యాప్తులో తేలింది. బెంగళూరుకు చెందిన మలయాళీ ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి ఈ బంగారు పూత పలకలను చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లు గుర్తించారు. బంగారు పూత వేస్తామని మాయం చేశారు. 

Advertisment
తాజా కథనాలు