Lashkar-e-Taiba: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోతున్న పాక్.. POK నుంచి లష్కరే తోయిబా పరుగో పరుగు..!

భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలోని మారుమూల ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పరుచుకుంటున్నారు. 

New Update
lashkar

Lashkar-e-Taiba (LeT) is building a terror training centre in Khyber Pakhtunkhwa

ఆపరేషన్ సింధూర్...నాలుగు రోజుల పాటూ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను దుమ్ము దులిపింది. తీవ్ర దాడులతో విరుచుకుపడింది.  దాదాపు భారత్ కు దగ్గరలో పీవోకే లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ దెబ్బ ఉగ్రవాదుల మీద గట్టిగానే పడింది. వారు ప్రస్తుతం ఇండియా అంటే భయంతో పరుగులు తీస్తున్నారని తెలుస్తోంది. అందుకు తమ స్థావరాలను సైతం మార్చుకుంటున్నారు.  పంజాబ్ , పీవోకేలను వదిలి భారత్ కు దూరంగా ఖైబర్ పక్తుంఖ్వాకు వెళ్ళిపోతున్నారని తెలుస్తోంది. 

ఖైబర్ పక్తుంఖ్వాలో కొత్త స్థావరాలు..

జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ల తర్వాత అమెరికా,  ఐక్యరాజ్యసమితి కూడా లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.  దాంతో పాటూ ప్రస్తుతం పాకిస్తాన్ కూడా వారికి సాయం చేసే పరిస్థితుల్లో లేదు. ఈ కారణంగానే ఉగ్రవాద సంస్థలన్నీ  దూరంగా వెళ్ళిపోతున్నాయని చెబుతున్నారు.  ఆఫ్ఘన్ సరిహద్దు నుండి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ దిర్ జిల్లాలో లష్కరే మర్కజ్ జిహాద్-ఎ-అక్సా అనే కొత్త స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు, ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ జరిగిన రెండు నెలల తర్వాత ఇది ప్రారంభమైందని చెబుతున్నారు. అంతకు ముందు మే 7న భింబర్-బర్నాలాలోని లష్కరే స్థావరం మర్కజ్ అహ్లే హదీస్ ను భారత సైన్యం ధ్వంసం చేసింది దాని తర్వాత వారిదే ఫిదాయీన్ యూనిట్ అయిన జాన్-ఎ-ఫిదాయ్ ను కూడా నాశనం చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే వారు వాళ్ళ స్థావరాలను మార్చుకుంటున్నారని చెబుతున్నారు. 

తమ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది..

దీని కంటే కొన్ని రోజుల ముందు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆపరేషన్ సిందూర్ లో తమపై జరిగిన దాడి గురించి ప్రకటన చేశారు. లష్కరే తోయిబా టాప్‌ కమండర్‌ ఖాసిమ్ దీని గురించి స్పందించారు. తమ స్థావరాలపై భారత్‌ దాడులు చేసిందని అంగీకరించారు.'' మురిద్కేలో ఉన్న మా ప్రధాన కార్యాలయం భారత్‌ చేసిన దాడుల్లో ధ్వంసమయ్యింది. ఈ కార్యాలయాన్ని గతంలో కంటే మళ్లీ భారీగా నిర్మిస్తామని'' వ్యాఖ్యానించాడు. ఆ ధ్వంసమైన కార్యాలయంలో చాలామంది ముజాహిద్దీన్‌లు(ఉగ్రవాదులు) ట్రైనింగ్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఇతడు ఓ వీడియోలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ యువత ఇక్కడ ఉగ్రశిక్షణ(దౌరా ఇసుఫా)లో భాగం కావాలన్నారు. ఇందులో మతం, జిహాదీపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఇక మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ కూడా మాట్లాడాడు. పాక్‌ ప్రభుత్వం, సైన్యం తమకు ఉగ్రస్థావారాలను పునర్నిర్మించేందుకు నిధులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం చేసినటువంటి  9 ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్‌ కూడా ఒకటి ఉన్నట్లు తెలిపాడు.    

Also Read: India-pak: పాక్ పీఎం కు ఇచ్చి పడేసిన భారత దౌత్య వేత్త..నాటకాలాడొద్దని హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు