/rtv/media/media_files/2025/06/05/gtO6zYnGmb2hBRdcP8rU.jpg)
Pakistan spy Madam N
తవ్వుతున్న కొలది పాకిస్తాన్ స్పై విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కింద పనిచేసే ఒక మహిళా వ్యాపారవేత్త ఇండియాలోని ఇన్‌ఫ్లూయెన్సర్లను గూఢచర్యంలోకి తీసుకొస్తోంది. నోషబ షెహజాద మసూద్ లాహోర్‌లో జయాన ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో ఓ సంస్థను నడిపిస్తోంది. ఈమె భర్త పాక్ సివిల్ సర్వీసెస్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు.
ఇది కూడా చూడండి:Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
How 'Madam N' Lured Indian Social Media Influencers To Spy For Pakistanhttps://t.co/IkGPJyuAhE via @ndtvpic.twitter.com/qqfjERMOsK
— Debanish Achom (@debanishachom) June 5, 2025
ఇది కూడా చూడండి:Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
ఇన్‌ఫ్లూయెన్సర్లకు హెల్ప్ చేసి..
భారత్‌కు చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్లు పాక్‌లో పర్యటించడానికి ఈమె హెల్ప్ చేస్తోంది. జ్యోతి మల్హోత్రాకు కూడా ఆమె సాయం చేసింది. పాక్ ఐఎస్‌ఐ ఆమెకు ‘మేడమ్ ఎన్’ అనే కోడ్ పెట్టింది. పాక్‌లో హిందూ, సిక్కు యాత్రికులు పర్యటనకు షెహజాద ఏర్పాటు చేస్తుంది. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్‌తో ఈమె కలిసి పనిచేస్తోంది. పాక్ సైన్యం, ఐఎస్‌ఐతో ఈమెకు బలమైన సంబంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ట్రావెల్ ఏజెంట్లను కూడా నియమించినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి:Operation Kagar : చత్తీస్ గఢ్ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?
ఇటీవల భారత్‌లో అరెస్టు అయిన ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించగా షెహజాద పేరు బయటకు వచ్చింది. దేశంలో ఈమె దాదాపుగా 500 మందితో స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. దేశంలో 3,000 మంది సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరిలో 1500 మంది ఎన్నారైలు పాక్‌ను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈమె రికమండేషన్ ఉంటే మాత్రం భారతీయులకు విజిటర్ వీసా వచ్చేస్తుందట.