Piyush Chawla Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మరో భారత క్రికెటర్

భారత క్రికెటర్, సీనియర్ లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా భావోద్వేగ మెసేజ్‌ను పంచుకున్నాడు. అతడు 2007 T20 ప్రపంచకప్, 2011 ODI ప్రపంచకప్ విజేత జట్లలో భాగమయ్యాడు.

New Update
Piyush Chawla Announces Retirement From All Forms Of Cricket

Piyush Chawla Announces Retirement From All Forms Of Cricket

భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆటగాళ్లలో లెగ్ స్పిన్నర్, పియూష్ చావ్లా ఒకరు. రెండుసార్లు ప్రపంచ కప్ విజయాలలో భారతదేశం తరఫున ఆడిన పియూష్ చావ్లా ఇవాళ (శుక్రవారం) షాకింగ్ డెషిసన్ తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 36 ఏళ్లకే అతడు అన్ని ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ పార్మ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశాడు. ‘‘రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో ఉన్న తర్వాత.. అందమైన ఆటకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది.’’ అని చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

Piyush Chawla Retirement

‘‘భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుండి 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్ విజేత జట్లలో భాగం కావడం వరకు.. ఈ అద్భుతమైన ప్రయాణంలో ప్రతి క్షణం ఒక వరం లాంటిది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటాయి. నాపై నమ్మకం ఉంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలైన పంజాబ్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నా కెరీర్‌లో నిజంగా ప్రత్యేకమైన అధ్యాయం. నేను అందులో ఆడుతున్న ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందించాను. నన్ను నేను ఒక క్రికెటర్‌గా తీర్చిదిద్దినందుకు.. పోషించినందుకు నా కోచ్‌లు కెకె గౌతమ్, దివంగత పంకజ్ సరస్వత్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుండి నేను అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు.’’ అని తన పోస్టులో తెలిపాడు. 

కాగా చావ్లా 2012లో చివరిసారిగా ఆడే వరకు ఆరు సంవత్సరాల పాటు భారతదేశం తరపున 3 టెస్టులు, 25 ODIలు, 7 T20Iలు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్ విజయాలలో భారతదేశం తరపున ఆడిన చావ్లా, ప్రొఫెషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 1000 వికెట్లకు పైగా సాధించాడు. 

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

మార్చి 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అప్పటికి చావ్లా వయసు 17 సంవత్సరాల 75 రోజులు. సచిన్ టెండూల్కర్ (16 సంవత్సరాలు 205 రోజులు) తర్వాత ఈ ఫార్మాట్‌లో భారతదేశం తరపున రెండవ అతి పిన్న వయస్కుడైన పురుష అరంగేట్ర ఆటగాడుగా నిలిచాడు.

 

latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
తాజా కథనాలు