Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. 24 గంటల తర్వాత యుద్ధం క్లోస్

ఇరాన్, ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది.

New Update
Trump

12 రోజులుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడులు, ప్రతిదాడులతో అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లైంది. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు.

Also Read :  ఏపీలో ట్రైన్ సిగ్నల్ వైర్లు కట్ చేసి భారీ దోపిడీ.. సినిమాను తలపించే ఇన్సిడెంట్..!

Iran-Israel War - Donald Trump

ఈ సందర్భంగా ట్రంప్‌ రెండు దేశాలను అభినందించారు. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ బషరత్‌ అల్‌ ఫాత్‌ పేరుతో ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

Also Read :  రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు

అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో 6 గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. మొదట ఇరాన్‌ కాల్పుల విరమణను ప్రారంభించనుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ఎండ్ కార్డు పడనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ఇరు దేశాల్లో శాంతి నెలకొనుంది.

Also Read :  30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!

Also Read :  ఏపీలో ఘోరం.. కార్లు, బైక్‌లపైకి దూసుకెళ్లిన లారీ.. స్పాట్‌లో ముగ్గురు మృతి -మరో 16 మంది

 

latest-telugu-news | ceasefire | 47th us president donald trump | trump | america | iran-israel-war | iran and israel

Advertisment
Advertisment
తాజా కథనాలు