లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు దహించేస్తోంది. 24 గంటలు గడిచినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ మంటల కారణంగా పదివేల మంది హాలీవుడ్ నటులు, మ్యుజీషియన్స్ తమ ఇళ్ళను ఖాళీ చేయాల్సి వచ్చింది. వీరందరూ తమ ఇళ్ళు, కార్లను వదిఏసి మరీ చేతికి అందిన వస్తువులతో రోడ్ల మీదకు పరుగెట్టారు. దీంతో లాస్ ఏంజెలెస్‌లో విపరీతంగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఈ మంటల కారణంగా ఐదుగురు చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో గాలి వేగం చాలా ఎక్కువగా ఉన్నందున కార్చిచ్చును అదుపులోకి తీసకుని రాలేకపోతున్నారు. గత 24 గంటల్లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్,గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల నుండి 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read : నా కొడుకు చెప్పేవి వినొద్దు.. ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు ఈశాన్యంలో పుట్టిన అగ్ని... లాస్ ఏంజెలెస్ (Los Angeles) లో ప్రకృతికి నిలయమైన ఈశాన్య ప్రాంతంలోని పర్వతాలు మొదట మంటలు స్టార్ట్ అయ్యాయి. బలమైన గాలుల కారణంగా అది వేగంగా విస్తరించింది. అక్కడి నుంచి అది రాజుకుంటూ మొత్తం నగరాన్ని కబళించింది. దాంతో పాటూ పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మరో అగ్గి రాజుకుంది. ఇది తీరం వెంట ఉన్న సెలబ్రిటీల నివాస ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. Also Read : Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు ! ఎమర్జెన్సీ ప్రకటన... కాలిఫోనియా (California) లోని మంటలను అఉపులోకి తీసుకురాడదానికి అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది సరిపవం లేదు. దీంతో ఏంజెలెస్‌లో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. దాంతో పాటూ పక్క సీటీలు, రాష్ట్రాల నుంచి అనుభవం గల, రిటైర్డ్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను పిలిపిస్తున్నారు. అమెరికాలోని రెండవ అతి పెద్ద నగరం చుట్టూ చెలరేగిన మంటల్లో 1000 భవనాలు కంటే ఎక్కువ ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. దాంతో పాటూ ఆకాశంలో కమ్మకున్న పొగ అకడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. Also Read: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! నీటి కొరత లాస్ ఏంజెలెస్‌లో చీకటి పొగ వ్యాపించడంతో, ఆ ప్రాంతంలో నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో అక్కడి హైడ్రాంట్‌లు ఎండిపోతున్నాయి. మంటలను అదుపు చేయడానికి కష్టంగా ఉంటే ఇప్పుడు ఈ నీటి కొరత మరింత పీడిస్తోందని లాస్ ఏంజిల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జానిస్సే క్వినోన్స్ చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న నీటని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. మరోవైప మంటల కారణంగా కాలిఫోర్నియాలో చిక్కుకున్న అధ్యక్షుడు బైడెన్...అక్కడే ఉండి పరిస్థితిని సమీసిస్తున్నారు. తాము చేయగలిగిందంతా చేస్తున్నామని బైడెన్ చెప్పారు. హాలీవుడ్ ఆగిపోయింది... కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ అంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ అన్నీ రద్దయిపోయాయి. చాలా మంది ఇళ్ళే లేకుండా పోయారు. మళ్ళీ ఎప్పటికి అంతా మామూలు అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. Also Read: NASA: అద్భుతమైన అరోరా వీడియోను పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి