ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే ట్వీట్లకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. చాలామంది వాటిని రీట్వీట్ కూడా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మస్క్ ఇతర దేశాల్లో రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చెప్పిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
Also Read: అమెరికాలో తెలుగోళ్ల భారీ కుంభకోణం.. యాపిల్‌లో 185 ఉద్యోగులు ఊస్ట్
'' ఎలాన్ మస్క్ చెప్పింది ప్రజలు వినాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో అతను మాములు మనిషి. అతను బిలియనీర్ కాబట్టి చాలామంది అతనుచెప్పిన విషయాలను రీట్వట్ చేస్తుంటారు. మస్క్ చెప్పినవన్నీ పట్టించుకోవద్దు. దాని గురించి చింతించకుండా అతడిని బయటకు పొమ్మని చెప్పాలని'' ఎర్రల్ మస్క్ అన్నారు. ఇదిలాఉండగా ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌స్టార్మర్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ చేస్తున్న అరచకాలపై వరుసగా ప్రకటనలు చేశారు. స్మార్మర్ వాటిని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం సామూహిక అత్యాచారాలకు సహకరించారని అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ తండ్రి దీనిపై స్పందించారు. తన కొడుకు మాటలను పట్టించుకోవాల్సని అవసరం లేదని చెప్పారు. అయితే ఎలాన్ మస్క్‌కు ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ మధ్య భేదాభిప్రాయులు ఉన్నాయి. గతంలో ఎలాన్ మస్క్ జీవితంపై పుస్తకం రాసిన రచయిత ఐజాక్సిన్ కూడా ఈ విషయాన్ని బయటపెట్టారు. మరోవైపు మస్క్ చేసిన ఆరోపణలు స్టార్మర్ ఖండించారు. మస్క్ పేరును ప్రత్యక్షంగా చెప్పకుండానే.. తనపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read: ఉస్మానియా యూనివర్సిటీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్!
ఓట్ల కోసం సామూహిక అత్యాచారాలకు సహకరించారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలను స్టార్మర్ తిరస్కరించారు. మస్క్ (Elon Musk) పేరును ప్రస్తావించకుండా.. అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్నారు. అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.