Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు ! జనవరి నెలలో రాబోయే తొలి ఏకాదశి అంటే జనవరి 10న 'పౌష పుత్ర ఏకాదశి'. అయితే పౌష పుత్ర ఏకాదశి 5 రాశుల వారికి శుభ గడియాలను సూచిస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకోండి. By Archana 09 Jan 2025 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 హిందూ క్యాలెండర్ ప్రకారం, పుత్రదా ఏకాదశిని పౌష్ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. 2/8 ఈ ప్రత్యేకమైన రోజున శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. జీవితంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతారు. 3/8 ఈ సారి పౌష పుత్రదా ఏకాదశి రోజున శుక్ల యోగం ఏర్పడబోతోంది. కావున మరింత ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ ఏకాదశి శుక్రవారం రోజున వస్తున్నందున ఈ 5 రాశుల వారిపై లక్ష్మి దేవి ఆశీసులు ఉంటాయట. 4/8 ఈ ఏకాదశి నుంచి మేష రాశి వారికి ఉద్యోగాలలో పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అన్ని జీవిత సమస్యలు, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సూచిస్తుంది. 5/8 పౌష పుత్రద ఏకాదశి కర్కాటక రాశి వారికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాశి వారు ఈ ఏకాదశి నుంచి కొన్ని కొత్త పనులను ప్రారంభించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే డబ్బు కూడా అనుకున్న సమయంలో అందుతుంది. 6/8 పౌష పుత్ర ఏకాదశి తులారాశి వారి జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అన్ని పనులలో విజయం సాధిస్తారు. 7/8 పౌష పుత్ర ఏకాదశి నుంచి ధనుస్సు రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లాభం, ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 8/8 మీన రాశి వారు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో కష్టపడి పనిచేయడం వల్ల లాభాలు వస్తాయి. #telugu-news #life-style #latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి