దేవుని దర్శనం కోసం పాకులాడితే ఏకంగా దేవుని దగ్గరకే వెళ్ళిపోయారు. తిరుమలలో తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా మరో 50 మంది దాకా తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులు తిరుపతి రుయా, సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పుడూ లేనిది ఇంతలా తొక్కిసలాట జరగడానికి కారణాలేంటి? ఒక్క సారే అంత ఘోరం ఎలా జరిగింది అనే వెతుకులాటలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. తోపులాటకు కారణం ఇదే.. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి ద్వార సర్వదర్శనం టికెట్ల కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10 నుంచి మూడు రోజులకు సంబంధించి మొత్తం 1.20 టికెట్లను ఇస్తామని చెప్పారు. గురువారం ఉదయం 5 నుంచి టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. దీంతో బుధవార రాత్రి నుంచే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర క్యూలు కట్టేశారు. ఇందులో బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూలు దగ్గర తోపులాట జరిగింది. ఇక్కడ క్యూలో నిలుచున్న భక్తులు చాలా ఎక్కువ మంది ఉండటంతో వారిని పద్మావతి పార్క్ లోకి తరలించారు. అయితే టికెట్ల జారీ క్యూ లైన్ దగ్గర అనారోగ్యంతో ఆయసపడుతున్న వృద్దురాలను గుర్తించి గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకువచ్చేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నించారు. దీనికి వృద్ధురాలి వెనుకున్న భక్తులు కూడా సహకరించారు. ఆమె ఒక్కతినే లోపలికి తీసుకుని వెళుతున్నారు. కానీ ఇంతలో కొద్ది దూరంలో కేకలు అరుపులతో దుమారంలేచింది. అక్కడి నుంచి అది ఎక్కువై తోపులాటగా మారింది. వృద్ధురాలి కోసం గేట్లు తెరిస్తే టోకెన్ల జారీ కోసం తెరుస్తున్నారని భక్తులు అనుకున్నారు. దీంతో బలంగా తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ ముందుకు వచ్చారు. దీంతో చాలా మంది కిందపడిపోయారు. తోపులా, తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు ఊపిరాడక అస్వస్థతకు గురైయ్యారు. కుట్రకోణం.. తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు , అన్ని వైపుల నుండి భక్తులను వాకబు చేస్తున్నారు. మరోవైపు సిసి ఫుటేజ్ ల ఆధారంగా తొక్కిసలాట ఎలా జరిగిందో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక మొదటి వరుసలోని భక్తుల ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీటంతటికీ ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. కావాలనే వారు ఉద్దేశపూర్వకంగా ఈపని చేశారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరా అని టీటీడీ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు ఇదంతా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Movies:గేమ్‌ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్