/rtv/media/media_files/2025/02/26/PyG2hXsdvti9zwOY6McS.jpg)
south korea BRIDGE COLLAPSE Photograph: (south korea BRIDGE COLLAPSE)
BRIDGE COLLAPSE Viral Video: భారీ వంతెన ఇంకా నిర్మాణంలోనే ఉంది.. అంతలోనే పేకమేడలా కూలిపోయింది. ఓ హైవే రోడ్డుపై ఏర్పాటు చేస్తున్న పెద్ద బ్రిడ్జ్ కళ్లుమూసి తెరిచే లోగా నేల మట్టం అయ్యింది. ఈ దృశ్యాలు కారు రివర్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దక్షిణ కొరియాలో దాదాపు పదుల మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: మజాకా రివ్యూ.. సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడిందా?
BRIDGE COLLAPSE in Cheonan, South Korea 🇰🇷
— Light Beings Observer (@BeingsObserver) February 25, 2025
3 deaths and 5 injured after bridge collapse at an expressway under construction.
Developing... Missing people still under the rubbles. pic.twitter.com/TxbKbsSCRN
బ్రిడ్జ్ శిథిలాల క్రిందే 10 మంది వర్కర్లు..!
ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు కార్మికులకు గాయాలైయ్యాయి. 10 మంది వర్కర్లు బ్రిడ్జ్ శిథిలాల క్రిందే చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటన దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న చియోనాన్ సిటీలో ఫిబ్రవరి 25న జరిగింది. గాయపడిన కార్మికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తప్పిపోయిన వారిని వెలికితీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: Elon musk : ఎలన్ మస్క్‌కు సుఖేష్ చంద్ర శేఖర్ 2 బిలియన్ డాలర్స్ ఆఫర్
#BREAKING #SouthKOREA #CoreaDelSur
— LW World News 🌏 (@LoveWorld_Peopl) February 25, 2025
🔴 SOUTH KOREA :📹 HORRIFIC MOMENT OF A BRIDGE COLLAPSE AT AN EXPRESSWAY CONSTRUCTION SITE IN CHEONAN
At least 4 people died, 6 injured - 5 in critical condition -.#Ultimahora #Collapse #Colapso #Accident #Accidente pic.twitter.com/yvDkW0HiN6
Also Read: BIG BREAKING: ఆర్మీ విమానం క్రాష్.. 10 మంది మృతి
బ్రిడ్జ్ కూలడం రోడ్డుపై వెళ్తున్న కారు వెనుక కెమెరాలో రికార్డ్ అయ్యింది. అయితే ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఎత్తులో ఉన్న భారీ బ్రిడ్జ్ కూలడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!