/rtv/media/media_files/2025/02/26/59hfsywlI1uArOKJlfbW.jpg)
Sudan Army plane crashes Photograph: (Sudan Army plane crashes )
సైనికుల విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి విమానం బయలుదేరుతుండగా కుప్పకూలిపోయింది. టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ అధికారులు, పౌరులు మరణించారు. ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటన వల్ల వాడి సీద్నా ఎయిర్ బేస్ సమీపంలోని పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Also Read: TS: అన్ని స్కూళ్ళల్లో తెలుగు తప్పనిసరి..విద్యాశాఖ
A military plan crashed in SUDAN due to technical failure in Omdurman,killing a number of high-ranking military officers pic.twitter.com/jqdPdSuIWL
— EvaMeva (@ewa_baczkowska) February 25, 2025
Also Read : తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం
ఆంటోనోవ్ విమానం ప్రమాదానికి గురైంది, దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. మరణించిన వారిలో అనేక మంది సూడాన్ సాయుధ దళాల అధికారులు కూడా ఉన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. గత నెలలో కూడా దక్షిణ సుడాన్‌లో విమానం కూలి 20 మంది మరణించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఆ విమానం కూడా రన్ వేకు 500 మీటర్ల దూరంలోనే ప్రమాదానికి గురైంది. సుడాన్ దేశంలో 2023 ఏప్రిల్‌లో సూడాన్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది. వేల మంది సుడాన్ పౌరులు అంతర్యుద్ధంలో మరణించారు.