Majaka Twitter Review: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ నటించిన సినిమా ‘మజాకా’. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది?.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించింది?, సందీప్ కిషన్‌కు హిట్ పడిందా? లేదా? అనేది ప్రేక్షకుల రివ్యూ వచ్చేసింది.

New Update
sandeep kishan majaka movie twitter review in telugu

sandeep kishan majaka movie twitter review in telugu

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన కొత్త సినిమా ‘మజాకా’. రీతూ వర్మ, అన్షు, రావు రమేష్ రావు రమేష్ కీలక పాత్రలో కనిపించారు. ‘ధమాకా’ మూవీ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఇవాళ (ఫిబ్రవరి 26)న రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది?.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించింది?, సందీప్ కిషన్‌కు హిట్ పడిందా? లేదా? అనేది ప్రేక్షకుల రివ్యూ బట్టి చూసేద్దాం. 

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

MAJAKA TWITTER REVIEW

ఇందులో భాగంగానే మజాకా సినిమా చూసిన ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తి చేశాడు. ఫస్ట్ హాఫ్ లవ్ లెటర్ సీన్, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అలాగే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయిందని.. పవర్ స్టార్ రిఫరెన్స్ అండ్ పట్టీలు సీన్, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ సినిమా చాలా బాగుందని అన్నాడు. 

Also Read :  మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే

అయితే ఇంకొకరు మాత్రం మజాకా అనేది సగం నేపథ్యం కలిగిన కామెడీ డ్రామా అని తెలిపాడు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని.. సినిమాలోని ప్రతి ఒక్క బృందం అవసరమైన ఫ్లాష్‌ను తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నాడు. ఒక సినిమా ఎలా నిర్మించబడకూడదో ఇది ఒక సాక్ష్యం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

మరో వ్యక్తి మజాకా మూవీ చాలా బాగుందని అన్నాడు. ఫుల్ కామెండ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పుకొచ్చాడు. 

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

మరొకరు.. మజాకా అనేది ఒక సాధారణమైన, రన్-ఆఫ్-ది-మిల్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ అని అన్నారు. కొన్ని కామెడీ బ్లాక్‌లు అద్భుతంగా ఉన్నాయి. అందులో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సినిమా కాన్సెప్ట్, రావు రమేష్ రోల్, నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. సందీప్ కిషన్ కూడా అద్భుతంగా నటించాడు అని చెప్పుకొచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు