/rtv/media/media_files/2025/05/28/odS6psEzpXno6vyH5VNr.jpg)
Female Skydiver From Uk Dies
Jade Female Skydiver Dies: ఆమె ఒక స్కైడైవర్..పారాచూటింగ్‌లో 450 కిపైగా జంపింగ్ లు చేసిన అనుభవం ఆమెకుంది. అలాంటిది 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ కింద పడి మరణించడం అందరినీ విస్మయానికిగురిచేసింది. అయితే తన ప్రియుడితో బ్రేకప్ అయిన మరునాడే ఆమె స్కైడైవింగ్ చేయడం, పారాచూట్ తెరుచుకోకపోవడంతో ఆమె కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యూకేకు చెందిన మహిళా స్కైడైవర్ జేడ్ డమారెల్..10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ కింద పడి మరణించారు. పారాచూటింగ్‌లో 450కిపైగా జంపింగ్‌ల అనుభవం ఉన్న జేడ్ డమారెల్.. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో కిందపడి మరణించారు. డుర్హాం కౌంటీలోని షాటన్ కొలియరీలో ఈ ఘటన జరగింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాయి. కానీ, ఆమె స్పాట్‌లోనే మృతి చెందినట్టు నిర్ధారించాయి.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
జేడ్ డమారెల్ 26 ఏండ్ల యువకుడితో డేటింగ్ చేస్తోంది. స్కైడైవర్ కూడా అయిన ప్రియుడితో ఆమె గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నది. అయితే ఇద్దరి మధ్య మనస్పార్ధల కారణాంగ ఇద్దరూ విడిపోయారు. అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిన మరునాడే జేడ్ డమారెల్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే మొదట అది ప్రమాదంగా భావించినప్పటికీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా స్కై హై సంస్థ తెలిపింది. ఆమె పారాచూట్ వైఫల్యం చెందడానికి ఏమాత్రం అవకాశం లేదని, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని, ఆమె కావాలనే పారాచూట్ తెరుచుకునే బటన్‌ను నొక్కకుండా ఉందని పోలీసులు నిర్ధారించారు. దానికి ముందు జేడ్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రియుడితో బ్రేకప్ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితులు చెబుతున్నారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!