Kamal Haasan Kannada Controversy: కాక రేపుతున్న కమల్ కన్నడ కాంట్రవర్సీ..! “థగ్ లైఫ్” రిలీజ్ డౌటే..?

నటుడు కమల్ హాసన్ వివాదాల్లో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. నేను నా కుటుంబం లో అందరూ తమిళులే. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.

New Update
Kamal Haasan Kannada Controversy

Kamal Haasan Kannada Controversy

Kamal Haasan Kannada Controversy: చెన్నైలో నిర్వహించిన “థగ్ లైఫ్” ప్రమోషన్స్(Thug Life Movie Promotions) లో ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీశాయి. "కన్నడ భాష తమిళ భాష నుంచి పుట్టింది" అన్న ఆయన మాటలు కన్నడ సంస్కృతి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

ఈ వ్యాఖ్యలపై కర్ణాటక రక్షణ వేదిక సంస్థ చీఫ్ ప్రవీణ్ శెట్టి మండిపడ్డారు. "కర్ణాటక రాష్ట్రంలో మీ సినిమాలపై ఆదాయం సంపాదించాలనుకుంటున్నారు, మరోవైపు మా భాషను అపహాస్యం చేస్తున్నారు," అంటూ కమల్ హాసన్‌పై విమర్శలు గుప్పించారు.

Also Read: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!

కమల్ హాసన్‌కు హెచ్చరికలు.. 

ప్రవీణ్ శెట్టి తీవ్ర హెచ్చరిక చేస్తూ, "మీరు మళ్లీ కర్ణాటక భాష, ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తీవ్ర నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. మీ సినిమాలను నిషేధించడానికి కూడా మేము వెనుకాడం," అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

ప్రజా సంఘాల నిరసనలు.. 

అయితే, కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రో-కన్నడ సంఘాలు భారీ స్థాయిలో నిరసనలకు పిలుపునిచ్చాయి. కన్నడ భాష, సంస్కృతిని తక్కువచేసే ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రాజ్యసభకు కమల్ హాసన్..

ఇక రాజకీయ పరంగా కమల్ హాసన్‌ రాజ్యసభలోకి ప్రవేశించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2024 మార్చిలో తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం (MNM)ను "డిఎంకె" నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA)లో విలీనం చేసిన కమల్, తాజాగా డిఎంకే తరఫున రాజ్యసభ స్థానానికి ఎంపికవవుతారని సమాచారం.

డిఎంకేకి ఎదురుగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కమల్ హాసన్ ముఖ్య పాత్ర పోషించనున్నారని, అలాగే డిఎంకే తరపున ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇప్పటికే యాక్టివ్‌గా పాల్గొన్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

భాషల పట్ల గౌరవం, పరస్పర సంస్కృతుల పట్ల గౌరవ భావనలు ఏ రాజకీయ పరిణామాల్లోనైనా కీలకం. ప్రముఖులు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమల్ హాసన్ వ్యాఖ్యలపై మున్ముందు ఇంకా ఎలాంటి స్పందన రానుందో, పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు