US-Russia: అణు ఉద్రిక్తతలు పెరుగుతాయ్ జాగ్రత్త..అమెరికాకు రష్యా వార్నింగ్

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు విషయంలో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. రెండు అణు జలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించింది. దీనిపై రష్యా స్పందిస్తూ అణు ఉద్రిక్తతలు పెరగకుండా అమెరికా చూసుకుంటే మంచిదని హెచ్చరించింది.

New Update
usa-russia

USA-Russia

రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు జలాంతర్గాములను తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై రష్యా తీవ్రంగా రియాక్ట్ అయింది. అమెరికా భయంతోనే టారీఫ్ లను పెంచింది. ఇప్పుడు జలాంతర్గాములను కూడా అందుకే ఏర్పాటు చేస్తోంది అంటోంది వ్యాఖ్యలు చేసింది.  ఇది అణు ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని క్రెమ్లిన్ హెచ్చరించింది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయితే జలాంతర్గాముల విషయంలో తాము ఏమీ భయపడడం లేదు అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. 

అమెరికా భయపడుతోంది..

అంతర్జాతీయంగా తమ ఆధిపత్యం క్షీణించడం అమెరికా జీర్ణించుకోలేక పోతోందని రష్యా ఆరోపిస్తోంది. అందుకు తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకే సుంకాలతో దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని వ్యాఖ్యానించింది. అమెరికన్ జలాంతర్గాములు ఇప్పటికే యుద్ధ విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియే. దీనికి మేము భయపడడం లేదని పెస్కోవ్ అన్నారు. అమెరికా పట్ల రష్యా విదేశాంగ విధానం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు కొనసాగుతుందని పెస్కోవ్ ధృవీకరించారు. అణు సంబంధిత విషయాలపై రష్యా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే నడచుకుంటుందని చెప్పారు. 

Also Read: USA: వీసాలపై మరో ఉక్కు పాదం..15 వేలు కట్టాల్సిందే.. 

Advertisment
తాజా కథనాలు