/rtv/media/media_files/2025/08/05/usa-india-2025-08-05-08-08-04.jpg)
India-USA
అమెరికాపై భారత్ విరుచుకుపడింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలిని విమర్శించింది. భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని..జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ తెలిపింది. దాని కోసం అమెరికా భారత్ మీద వత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పింది. అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి భారత్ ను తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించి అమెరికానే ఇప్పుడు వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టింది. భారతదేశం 85% ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని తెలిపింది.
అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా నుంచి చౌకగా లభించే చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. దీంతో రష్యా, భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అయితే భారత్కన్నా యూరప్ దేశాలు రష్యా నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాయి. వాటిపై అమెరికా ఏమీ ఒత్తిడి తీసుకురావడం లేదు. కానీ భారత్ చమురు దిగుమతి మీద ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంత మంచివి కావని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. యూరప్, రష్యాతో చేస్తున్న వ్యాపారాలను అన్నింటినీ విదేశాంగ శాఖ ఎత్తి చూపించింది. అమెరికా అన్ని దేశాల విషయంలో ఒకేలా ఉండాలని సూచించింది. భారతదేశం తమ జాతీయ ప్రయోజనాల కోసం ఏం చేయాలో, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి నిర్ణయాలను తీసుకునే పూర్తి హక్కు కలిగి ఉందని మరోసారి ఉద్ఘాటించింది. అమెరికా అనవసర వత్తిడి, జోక్యం తగ్గిస్తే మంచిదని విదేశాంగ శాఖ హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకం, పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ పెద్దమొత్తంలో చమురు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయడమే కాకుండా.. ఆ ఇంధనాన్ని బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు పొందుతోందని విమర్శించారు. రష్యా చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌లో అమాయకులు ప్రాణాలు పోతున్నా వారికి పట్టడం లేదంటూ మండిపడ్డారు. అందుకే భారత్‌పై మరోసారి భారీగా టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించారు.
Also Read: US-Russia: అణు ఉద్రిక్తతలు పెరుగుతాయ్ జాగ్రత్త..అమెరికాకు రష్యా వార్నింగ్