USA: వీసాలపై మరో ఉక్కు పాదం..15 వేలు కట్టాల్సిందే..

అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం మరో కొత్త ప్రోగ్రామ్ ను మొదలుపెట్టింది. తమ దేశంలోకి వ్యాపారం, టూరిజం కోసం వచ్చిన వారు ఎక్కువ రోజులు ఉండిపోకుండా 15 వేల డాలర్ల బాండ్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయనుంది. 

New Update
Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas

ఇక మీదట అమెరికాకు వ్యాపారం లేదా టూరిజం కోసం వెళ్ళాలనుకుంటే ముందు కొంత డబ్బు జమ చేయాల్సిందే. అలా చేయకుంటే అసలు వీసానే రాదు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ వీసాలను టైట్ చేసే ప్రోగ్రామ్ లో భాగంగా మరో కొత్త రూల్ ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం వ్యాపారం, పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నాక యూఎస్ లో ప్రవేశించే ముందు  $5,000, $10,000 లేదా $15,000 బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తుదారులకు నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకే ఈ పద్దతిని ప్రారంభించనున్నారు. ఆగస్టు 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. 

ఓవర్ స్టే కారణంగానే..

ఇప్పటికే అమెరికా వీసాలను మంజూరు చేయడంలో చాలా రూల్స్ ను టైట్ చేసింది అక్కడి ప్రభుత్వం. దీనిలో సోషల్ వెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. దీనిలో ఇప్పటికే దేశంలో చాలా మంది సోషల్ మీడియా ఖాతాలలో తేడాలున్నాయని గమనించింది. అలాగే వ్యాపారం, పర్యాటకం కోసం వచ్చిన వారు ఓవర్ స్టే ఉండిపోయారని తెలిసింది. అందుకే ఇప్పుడు కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టామని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ చెబుతోంది. అయితే ఇది అన్ని దేశాల వారికీ ఉండకపోవచ్చును. కొన్ని రోజుల్లో ఈ బాండ్లను సమర్పించే దేశాల లిస్ట్ ను తయారు చేయనున్నారు. దరఖాస్తుదారుడి వ్యక్తిగత పరిస్థితులను బట్టి బాండ్ ను మాఫీ చేయవచ్చని చెబుతున్నారు. అలాగే వీసా మినహాయింపు కార్యక్రమంలో చేరిన దేశాల పౌరులకు ఈ బాండ్ వర్తించదు. ఇది 90 రోజుల వరకు వ్యాపారం లేదా పర్యాటకం కోసం ప్రయాణాన్ని అనుమతిస్తుంది. ప్రస్తుతానికి ఈ కార్యక్రమంలో చేరిన 42 దేశాలలో ఎక్కువ భాగం యూరప్‌లో ఉన్నాయి. మరికొన్ని ఆసియా, మిడిల్ ఈస్ట్ లాంటి ఇతర ప్రాంతాలలో ఉన్నాయి. 

Also Read: Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు