Los Angeles: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

అమెరికాలో లాస్‌ ఏంజెల్స్‌లోని భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్‌ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Australian Reporter Shot At While Covering Los Angeles Protests

Australian Reporter Shot At While Covering Los Angeles Protests

అమెరికాలో లాస్‌ ఏంజెల్స్‌లోని వలసదారుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న 2 వేల మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డౌన్‌టౌన్‌లో ఎవరూ గుమికూడొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రాంతంలో భద్రతా దళాలు ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఓ ఆస్ట్రేలియన్ రిపోర్టర్‌ అక్కడ జరుగతున్న పరిస్థితులు వివరిస్తోంది. అదే సమయంలో ఓ రబ్బరు తుటా ఆమె కాలికి తగిలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Also Read :  అఖండ-2 టీజర్ వచ్చేసింది.. బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!

Australian Reporter Shot At Los Angeles Protests

Also Read: కేరళ కోజికోడ్‌ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు

మరోవైపు డౌన్‌టోన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ ప్రాంతంలో ఆందోళనకారులు సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. అలాగే 101 ఫ్రీవే ను అడ్డుకున్నారు. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు కూడా వివిధ వస్తువులను విసిరేశారు. చాలావరకు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. 

ఇదిలాఉండగా లాస్‌ ఏంజెల్స్‌లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్‌ ఆదేశించారు. ఆదివారం అక్కడ ఆందోళనలు తీవ్రతరం కావడంతో మాస్కులు వినియోగంపై ఆయన నిషేధం విధించారు. ఇప్పటికే నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు. వాస్తవానికి అమెరికాలో ఎక్కడైన ఆందోళనలు జరిగితే నేషనల్ గార్డ్స్‌ను బరిలోకి దింపే ముందు ఆ రాష్ట్ర గవర్నర్‌తో చర్చలు జరిపి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ట్రంప్‌ మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అక్కడివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి

Also Read :  ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లించింది : భట్టి

telugu-news | rtv-news | Donald Trump | international news in telugu | today-news-in-telugu | latest-telugu-news | los-angeles

Advertisment
Advertisment
తాజా కథనాలు