/rtv/media/media_files/2025/05/15/TtxY0IkzImBUZqp3E1ri.jpg)
China's Da Yang Yi Hao Spy Ship
China Spy Ship: పహల్గామ్ దాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు(India Pakistan War) నెలకొన్న నేపథ్యంలో చైనా గూఢచారి నౌక భారత్ కు చేరువలోకి వచ్చేసింది. యాంగ్ యి హావో అనే షిప్(Da Yang Yi Hao Spy Ship) భారత్ పొరుగు ప్రాంతంలోకి వెళుతోందని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. చైనా ఈ షిప్ లను పరిశోధన నౌకలు అని చెబుతున్నా భారత్ మాత్రం వీటిని గూడఛారి నౌకలుగా గుర్తించింది. ఇవి సముద్ర అడుగు భాగాన్ని మ్యాప్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అంతేకాదు జలాంతర్గాముల ఉనికి కూడా గుర్తిస్తాయి. భారత్, పాక్ యుద్ధంలో చైనా పాకిస్తాన్ వైపు ఉంది. ఆ నేపథ్యంలో వారి గూఢచారి నౌక ఇటువైపు రావడం...మన రహస్యాలను పాక్ కు చేరవేసే ఉద్దేశ్యమేనని భావిస్తున్నారు. సైమన్ పంచుకున్న మ్యాప్ ప్రకారం, ఓడ మలక్కా జలసంధి నుండి వస్తోంది మరియు శ్రీలంకకు దక్షిణం వైపు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
China's DA YANG YI HAO, a geology & geophysics survey vessel, capable of seabed mapping, equipped with a submersible vessel onboard - has now entered the Indian Ocean Region pic.twitter.com/HGtJmyMdPb
— Damien Symon (@detresfa_) May 14, 2025
Also Read: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
చైనా స్పై షిప్(China Spy Ship) లు భారత్ లోకి
భారత్, పాక్ యుద్ధ కారణంగా మన నేవీ అన్నివైపులా జలాంతర్గాములను మోహరించింది. ఈ చైనా స్పై షిప్ లు భారత్ లోకి ఎంటర్ అవడం ఇదేమీ మొదటిసారి కాదు. లాస్ట్ ఇయర్ కూడా జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే నౌక భారత్ సముద్రంలోకి ప్రవేశించింది. మన ఖండాతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని5 ను కనుగొనే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. చైనాకు చెందిన నౌకలలో జియాంగ్ యాంగ్ హాంగ్ 03, యాంగ్ వాంగ్ 7 మరియు బీ డియో 996...ఇవన్నీ గూఢచారి నౌకలేనని చెబుతున్నారు.
Also Read: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
today-latest-news-in-telugu | spying | ship
Also Read: Pak: ఇది కూడా కాపీయేనా..మోదీని ఫాలో అయిన పాక్ ప్రధాని...ఆర్మీ దగ్గర డ్రామా