/rtv/media/media_files/2025/05/15/2QLEmHl4A2zIuwuNmS0t.jpg)
Indian Army
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడి చేసింది. ఇందులో పీవోకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసి వాటిని మట్టుబెట్టింది. భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయితే భారత్ సైనిక బలం ముందు అవి నిలబడలేకపోయాయి. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పని చేయకుండా ధ్వంసం చేసేసింది. కచ్చితమైన లక్ష్యాలతో విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేశామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో..
భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో పాటూ ఆత్మాహుతి డ్రోన్‌లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, అధిక-విలువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. లాటరింగ్ మందుగుండు సామగ్రి అనేవి ఆయుధ వ్యవస్థలు, ఇవి లక్ష్య ప్రాంతంపై ప్రదక్షిణలు చేసి, తగిన లక్ష్యం కోసం వెతుకుతాయి, ఆపై దాడి చేస్తాయి. వీటినే భారత్ ఉపయోగించింది. భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేశామని చెప్పారు. ఇందులో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీకు చెందిన యూఏవీలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ ,ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఏమీ చేయలేకపోయిందని అధికారులు తెలిపారు.
today-latest-news-in-telugu | Indian Army | pakistan air defence system | china
Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్