/rtv/media/media_files/2025/07/23/fourth-test-2025-07-23-08-02-58.jpg)
India Vs England Fourth Test
మూడు టెస్ట్ లు అయ్యాయి. రెండిటిలో ఓడిపోయింది. అయితే ఎక్కడా టీమ్ ఇండియా తడబడినట్లు కనిపించలేదు. మూడో టెస్ట్ లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయింది. బ్యాటింగ్ లో అయితే అన్ని టెస్ట్ లలో ఆధిక్యంలోనే ఉంది. మొదటి టెస్ట్ లో ఓడిపోయినప్పుడు సరిగ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది భారతజట్టు. అయితే అప్పుడు కూడా అనూహ్యంగా పుంజుకుని ఆ టెస్ట్ లో విజయం సాధించింది. ఇప్ుడు కూడా అలానే ఆడితే పర్వాలేదు. కానీ ఏ మాత్రం తడబడినా సీరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ గెలవలేకపోయినా కనీసం డ్రా చేసుకోవాలి.
Also Read : పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు
గాయాలతో సతమతం..
ఈ పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు ఈరోజు నుంచి మొదలయ్యే నాలుగు టెస్ట్ అత్యంత కీలకంగా మారింది. మాంచెస్టర్ లో ఈ టెస్ట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆట మొదలవుతుంది. అయితే ప్రస్తుతం భారత జట్టు గాయాలతో సతమతమౌతోంది. జిమ్‌లో గాయపడ్డ నితీశ్ కుమార్ రెడ్డి మొత్తం పర్యటనకే దూరం కాగా.. గజ్జల్లో గాయంతో ఆకాశ్ దీప్.. చేతి గాయం కారణంగా అర్ష్‌దీప్ నాలుగో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయారు. మూడో టెస్ట్ లో విశ్రాంతి తీసుకున్న ఈ టెస్ట్ లో కూడా అదే చేస్తాడు అనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం కనిపించడం లేదు.
Also Read : ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్ బ్యాచ్
ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం సాయి సుదర్శన్ మళ్ళీ ఆడే అవకాశం ఉంది. నితీశ్ స్థానంలో అతణ్ని తీసుకోవచ్చును. అలాగే అసలు ఇప్పటి వరకు అస్సలు ఆడని కరుణ నాయర్ ను కూడా కంటిన్యూ చేస్తామని కెప్టెన్ శుభ్ మన్ గిల్ చెప్పాడు. అయితే భారత్ కు శుభవార్ ఏంటంటే..వేలికి గాయం అయినా రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు ఆడతారు అనేది మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ప్రసిద్ధ్, శార్దూల్ లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మొదటి మూడు మ్యాచ్ లలో భారత జట్టు చేసిన తప్పులను అధిగమించి బాగా ఆడితే నాలుగు టెస్ట్ గెలవడం అంత కష్టమేమీ కాదు. తొలి టెస్టులో ఫీల్డింగ్ వైఫల్యాలు, లోయరార్డర్ తడబాటు దెబ్బ తీస్తే.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్, రెండో ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ వైఫల్యం కొంపముంచాయి. ఈ మ్యాచ్ లో ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం మొత్తానికే మోసం వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి.
Also Read: Trump Deal: అగ్రరాజ్యం జాక్ పాట్..జపాన్ తో బిగ్ డీల్
Also Read : వీడసలు మొగుడేనా?...బాత్రూంలో వీడియోలు తీసి భార్యనే బ్లాక్ మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి
india-vs-england-test-match | cricket | today-latest-news-in-telugu