/rtv/media/media_files/2025/07/23/karuppu-1st-look-2025-07-23-09-44-01.jpg)
Karuppu 1st Look
ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. 'కరుప్పు' టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేశారు. టీజర్ సూర్య మాస్ ఎంట్రీ, డైలాగ్స్ ఫ్యాన్స్ కి కిక్కెకించేలా ఉన్నాయి. నల్ల చొక్కా, లుంగీ ధరించి .. నోట్లో సిగరెట్ తో మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ఇందులో సూర్య ఒక లాయర్ పాత్రలో కనిపిస్తూనే.. మరోపక్కఒక పల్లెటూరి మాస్ కుర్రాడిగా అలరిస్తున్నారు. సూర్య 45వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.
With immense love and respect, we wish @Suriya_offl sir advance Happy Birthday! To celebrate in style, #KaruppuTeaser arrives tomorrow at 10 AM! #Karuppu@trishtrashers#Indrans@natty_nataraj#Swasika@SshivadaOffcl#SupreethReddy#AnaghaMayaRavi@anbariv#VikramMor… pic.twitter.com/Wz06eO1HBE
— DreamWarriorPictures (@DreamWarriorpic) July 22, 2025
Also Read : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
దీపావళి కానుకగా
2024లోనే చిత్రీకరణ ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మే 2025 నాటికి షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. దీపావళికి విడుదల కావచ్చని టాక్. దాదాపు 20 ఏళ్ళ తర్వాత సూర్య, త్రిష మళ్ళీ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అనఘా రవి, సుప్రీత్ రెడ్డి, నాట్టి నటరాజ్, స్వాసిక, ఇంద్రన్స్, యోగి బాబు, శివద, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్య గత కొన్ని చిత్రాలు రెట్రో, కంగువా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ఈ నేపథ్యంలో 'కరుప్పు' తో సూర్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
Also Read : నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
కథ
'కరుప్పు' అంటే నలుపు అని అర్థం. ఈ సినిమా ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే కోర్ట్ డ్రామాగా అని తెలుస్తోంది. సామాజిక సమస్యలు, కుల వివక్ష, రాజకీయ అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. అయితే ఏఆర్ రెహ్మాన్ ని అనౌన్స్ చేశారు.. కానీ కొన్ని కారణాల చేత ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సాయి వచ్చాడు.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
HBD Suriya | Karuppu 1st Look | actor-suriya