BREAKING: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలినారు ట్రంప్. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు.

New Update
trump and modi 1

trump and modi 1

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగియడానికి పూర్తి మద్దతు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

తన "ట్రూత్ సోషల్" ఖాతాలో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు. "నా మిత్రుడు, ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మోదీ బాగా పని చేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు!" అని ట్రంప్ పోస్ట్ చేశారు.

ట్రంప్ ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పినట్లు ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా ఈ ఫోన్ కాల్‌పై స్పందిస్తూ, ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు, నా మిత్రమా అని మోదీ పేర్కొన్నారు. మీలాగే, నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ సంఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాము," అని Xలో పోస్ట్ చేశారు.

ఇరు దేశాల మధ్య గతకొన్ని రోజులుగా టారీఫ్‌ల విషయంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ కాల్, ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసిన నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. గతంలో అమెరికా విధించిన సుంకాలు, రష్యా నుండి చమురు దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలను ఈ పరిణామం తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఈ విధమైన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలలో మరింత బలమైన బంధానికి సూచికగా నిలుస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు