Pak-Afghan War: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్..ఖతార్ మధ్యవర్తిత్వం

దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీని తరువాత కూడా రెండు దేశాలు మరో సారి సమావేశం అవనున్నాయి. 

New Update
pak-afghan (1)

శనివారం దోహాలో ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మ్య చర్చలు జరిగాయి. ఈ సంర్భంగా ఇరు దేశాల మ్యానా శాశ్వత కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు తెల్లవారు ఝామును ప్రకటించింది. కాల్పులు విరమణ అమలు, మరి కొన్ని విషయాలను ధృవీకరించడానికి పాక్, ఆఫ్ఘాన్‌లు మరోసారి సమావేశమవుతాయని ఖతార్ తెలిపింది. 

Also Read :  USA: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికాలో మళ్లీ ‘నో కింగ్స్‌’ పేరుతో నిరసనలు

కాల్పుల విరమణకు అంగీకారం..

2021లో ఆఫ్ఘాన్‌లో తలిబన్లు అధికారంలోకి వచ్చిన్పటి నుంచి పాకిస్తాన్‌తో గొడవ పడుతూనే ఉంది. రెండు పొరుగు దేశాల మధ్యనా అత్యంత దారుణమైన హింస చోటు చేసుకుంది. వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికి తోడు పది రోజులుగా పాక్, ఆఫ్ఘాన్‌లు ఎడతెగని దాడులు చసుకున్నాయి. అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు తాలిబన్లు డజన్ల కొద్దీ మరణించారు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ క్రికెటర్లు ముగ్గురిని పాకిస్తాన్ పోట్టన పెట్టుకుంది. దీంతో ఖతార్, టర్క్ఈ వంట దేశాలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. తన వరకు వస్తే యుద్ధాన్ని కచ్చితంగా ఆపుతానని చెప్పారు. అయితే ఈ లోపునే ఖతార్, టర్కీల సమక్షంలో పాక్, ఆఫ్ఘన్‌లు కాల్పులు విరమణ ఒప్పదం చేసుకున్నాయి. కాబూల్ రక్షణ మంత్రి ముహమ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలపై చర్చించారు. 

Also Read :  పహల్గామ్‌లో టూరిస్టులు.. నేడు అఫ్గాన్‌లో క్రికెటర్లు.. పాక్ దొంగ దెబ్బల చరిత్ర ఇదే!

Advertisment
తాజా కథనాలు