USA: ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికాలో మళ్లీ ‘నో కింగ్స్‌’ పేరుతో నిరసనలు

గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్‌' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.

New Update
Millions expected across all 50 US states to march in No Kings protests against Trump

Millions expected across all 50 US states to march in No Kings protests against Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుపై వివిధ దేశాలతో పాటు అమెరికన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్‌' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్  18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మొత్తం అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 2500లకు పైగా ప్రదేశాల్లో ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ నిరసనలకు ఐరోపా దేశాల్లో కూడా వీళ్లకు మద్దతుగా నిరసనలు చేశారు. 

Also Read: విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO

ట్రంప్ అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో డోజ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విభాగం వల్ల వేలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే జనతఃపౌరసత్వం, ట్రాన్స్‌జెండర్ల రక్షణ, అక్రమ వలసలు తదితర అంశాల్లో కూడా మార్పులు చేశారు. మరోవైపు వలసదారులపై అధికారులు సోదాలు చేయడం  తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే ట్రంప్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికన్లు రోడ్లపైకి ఎక్కారు. 

Also Read: మవోయిస్ట్ మరో అగ్రనాయకురాలు సరెండర్.. ఆమెపై రూ.5లక్షల రివార్డ్

అయితే స్థానికంగా నిరసనలు చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు ట్రంప్ సర్కార్‌ అనేక రాష్ట్రాల్లో జాతీయ బలగాలను మోహరించింది. దీంతో ఉద్రిక్తతలు మరింత చెలరేగాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్‌' పేరుతో నిరసనలు ప్రారంభించారు. అమెరికాలో రాజులు లేరని.. అవినీతి క్రూరత్వానికి వ్యతిరేకంగా తాము వెనక్కి తగ్గమని నిరసనలు నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పడు తాజాగా మళ్లీ ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ నిరసనలను రిపబ్లికన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేవారు అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్లని.. ఇది 'హేట్ అమెరికా' నిరసనలని అంటున్నారు . 

Also Read: దీపావళి బంపరాఫర్.. కేవలం రూ.11కే 2TB క్లౌడ్ స్టోరేజ్

Advertisment
తాజా కథనాలు