అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు లాకెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!

గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రారంభించింది. అయితే ఈ బంగారు లాకెట్లను WWW.Sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నగదు చెల్లింపును అక్కడికి వెళ్లి చూపిస్తే గోల్డెన్ లాకెట్ అందజేస్తారు.

New Update
Sabarimala gold lockets

Sabarimala gold lockets

అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బంగారు లాకెట్ల పంపిణీని ప్రారంభించింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్లు పంపిణీ చేశారు. మొదట బంగారు లాకెట్‌ను ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు. అయితే చాలా మందికి ఈ బంగారు లాకెట్లను ఎలా బుక్ చేసుకోవాలనే విషయం తెలియదు. గర్భ గుడిలో పూజించిన పవిత్రమైన బంగారు లాకెట్లను ఆర్డర్ చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మరి వీటిని బుక్ చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి..

అయ్యప్ప స్వామి ఫొటో ఉన్న బంగారు లాకెట్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే డైరెక్ట్‌గా నగదు చెల్లించి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే WWW.Sabarimalaonline.org లో గోల్డ్ లాకెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ నగదు చెల్లింపును అక్కడికి వెళ్లి చూపిస్తే గోల్డెన్ లాకెట్ అందజేస్తారు.

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల్లో ఈ లాకెట్‌లను తయారు చేశారు. అయితే 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.19,300గా నిర్ణయించారు. 4 గ్రాముల లాకెట్ ధర రూ.38,600, 8 గ్రాముల బరువున్న బంగారు లాకెట్ ధర రూ.77,200గా శబరిమల దేవస్థానం నిర్ణయించింది. రెండు రోజుల కిందట బుకింగ్ ప్రారంభం కాగా మొత్తం 100 మంది భక్తులు ఆ లాకెట్లను బుక్ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ ఈ బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను దక్కించుకున్నాయి. మలయాళ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలోని మొదటి రోజు విషు. ఈ సందర్భంగా బంగారు లాకెట్లను పంపిణీ చేశారు. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు