Weather: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 9 జిల్లాల్లో వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా ప్రకటించారు.