/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Karnataka Crime News
కర్ణాటకలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 32 ఏళ్ల మహిళను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానిక బస్ స్టాండ్ వద్ద జరిగింది. మృతురాలిని రేఖగా, నిందితుడిని లోహితాశ్వగా గుర్తించారు. ఈ దంపతులకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. రేఖకు ఇది రెండో పెళ్లి. ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె మొదటి భర్త నుంచి విడిపోయింది. లోహితాశ్వ కూడా విడాకులు తీసుకున్న వ్యక్తే. పెళ్లయిన తర్వాత వీరిద్దరు బెంగళూరుకు మకాం మార్చారు.
భార్యను కత్తితో పొడిచి..
రేఖ తాను పనిచేస్తున్న కాల్ సెంటర్లోనే లోహితాశ్వకు డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పించింది. అయితే.. గత కొంతకాలంగా లోహితాశ్వకు తన భార్యపై అనుమానం పెరిగింది. ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం అతడికి నచ్చలేదు. ఈ క్రమంలోనే రేఖ తన కుమార్తెతో కలిసి బస్ స్టాప్‌లో నిలబడి ఉండగా.. లోహితాశ్వ ఆమెపై కత్తితో దాడి చేశాడు. అతను ఆమెను డజన్ల కొద్దీ సార్లు పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
ఇది కూడా చదవండి: ఆశ్రయం ఇచ్చి ఇరుక్కుకున్నాడు.. పరువుపోతుందనుకుంటే ప్రాణం పోయింది
స్థానికులు ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాల కారణంగా ఆమె మరణించింది. లోహితాశ్వ రేఖ 12 ఏళ్ల కుమార్తెను కూడా కత్తితో పొడిచాడు. కానీ ఆమె గాయాలతో బయటపడింది. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేయబడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. కుటుంబ కలహాలు.. అనుమానాలే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఇది కూడా చదవండి: ఎంతపనిచేశావమ్మా .. నోటికి ప్లాస్టర్.. ముక్కుకు క్లిప్పు పెట్టుకుని ప్రాణం తీసుకున్న విద్యార్థిని