తెలంగాణలో రూ.80 లక్షల చోరీ కేసులో.. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్‌ హోటల్‌లో భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రూ.80 లక్షల చోరీ కేసు పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.66.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

New Update
MLG theft

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్‌ హోటల్‌లో భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రూ.80 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.66.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. విజయవాడ జగ్గయ్యపేట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వెల్లడించారు.

హోటల్‌ మొదటి అంతస్తులోని గది తలుపులు, లాకర్‌ పగులగొట్టి ఉండటంతో నిర్వాహకులు ఇటీవల పోలీసులకు సమాచారం అందించారు. సుమారు రూ.80 లక్షల నగదు దొంగలించినట్లు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాజాగా నిందితులను పట్టుకున్నారు.

Advertisment
తాజా కథనాలు