/rtv/media/media_files/2025/09/24/suspicious-death-of-a-student-in-nalsar-2025-09-24-08-08-57.jpg)
Suspicious death of a student in NALSAR.
Hyderabad: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విషాదం నెలకొంది. యూనివర్సీటీలో న్యాయశాస్త్ర విద్యార్థి సహస్త్రాన్షు(22) శనివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌కు చెందిన సహస్త్రాన్షు నల్సార్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ ఫైనలియర్ చదువుతున్నాడని తెలుస్తోంది. ఇతని తమ్ముడు కూడా నల్సార్‌లో లా కోర్సులో మూడో సంవత్సరం చదుతున్నాడని తెలుస్తోంది.
Also Read: కోల్‌కతాలో రికార్డు స్థాయిలో వర్షం.. 9 మంది మృతి, 30 విమానాలు రద్దు
అయితే సహస్త్రాన్షు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసింది. దీంతో ఆయనను అతని తమ్ముడు, సహచర విదార్థులు అంతా కలిసి శనివారం రాత్రి అతన్ని అల్వాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి సుచిత్ర లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది. అర్ధరాత్రి సమయంలో వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం నల్సార్ యూనివర్సీటీ అధికారులు రాయ్‌పూర్‌లో ఉన్న సహస్త్రాన్షు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
సహస్త్రాన్షు తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మృతదేహాన్ని రాయ్‌పూర్‌లోని అతని నివాసానికి తరలించారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని మృతిపై ఆరా తీయగా విద్యార్థులు అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందడంతో అధికారులు మంగళవారం నుంచి నల్సార్ యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. కాగా, విద్యార్థి మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని శామీర్‌పేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ తెలిపారు.
కాగా హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో ఐదోసంవత్సరం ఎల్ఎల్‌బీ విద్యార్థి సహస్త్రన్షు పాండే అనుమానాస్పద మృతిపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యార్థి మృతదేహానికి ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా, ఎలాంటి కేసునమోదు చేయకుండా వారి ఇంటికి తరలించడం, అనంతరం యూనివర్సీటీకి వరుసగా 12 రోజులు సెలవులు ప్రకటించడంపై ఏబీవీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్