/rtv/media/media_files/2025/06/24/father-rape-attempt-to-daughter-in-secunderabad-2025-06-24-10-16-07.jpg)
The woman was abducted, raped and killed by two auto drivers
HYD Crime: మద్యం సేవించిన ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా దారుణ హత్యకు పాల్పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా తమకు సహకరించడం లేదని బాధితురాలిని వివస్త్రను చేసి, మర్మాంగంలో కర్రలు గుచ్చి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ మృగాళ్లను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద ఈ నెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది.ఒంటి మీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా ఫోరెన్సిక్ నివేదికలో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయమై కేసు దర్యాప్తు ప్రారంభించిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు కిస్మత్‌పూర్ ప్రాంతంలోని అన్ని దారుల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టగా...
కాగా, మహిళ హత్యను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కిస్మత్‌పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్‌పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా ఆ ఆటో అదేరోజు మధ్యాహ్నం హైదర్‌గూడ కల్లు కంపౌండ్ వద్ద నుంచి ఒక మహిళను ఎక్కించుకుని వచ్చినట్లు తేలింది. అదే సమయంలో హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్‌పురా నుంచి హైదర్‌గూడలో ఉన్న కల్లు కంపౌండ్‌కు వచ్చినట్లు గుర్తించారు. అదేరోజు మృతురాలికి సంబంధించి యాకుత్‌పురా ఠాణాలో మిస్సింగ్ కేసు సైతం నమోదైనట్లు ఉంది. దీంతో ఆటో నంబర్ ఆధారంగా టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసలు తమదైన స్టైల్‌లో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు.
మద్యం సేవించి మృగాళ్లకు చిక్కి..
ఈ నెల 14న యాకుత్‌పురాకు చెందిన ఒక మహిళ కల్లు తాగేందుకు హైదర్‌గూడలో ఉన్న కల్లు కంపౌండ్‌కు వచ్చింది. విపరీతంగా కల్లు సేవించిన అనంతరం ఆ మత్తులో రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై పడిపోయింది. అదే సమయంలో టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న మహిళను గమచించి బలవంతంగా ఆమెను ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కించుకుని బుద్వేల్ మీదుగా కిస్మత్‌పూర్ బ్రిడ్జ్ వైపు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ నిర్మానుష ప్రదేశంలో వారిద్దరూ మద్యం సేవించారు. అనంతరం ఒకరి తరువాత ఒకరు సదరు మహిళపై లైంగికదాడికి చేశారు. అదే సమయంలో స్పృహలోకి వచ్చిన మహిళ వారిని ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయి మృగాళ్లుగా మారిన ఆటోడ్రైవర్లు ఆ మహిళను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె మర్మాంగంలో కర్రలు గుచ్చి, చిత్రహింసలు పెట్టి, అతి కిరాతకంగా కొట్టి చంపారు. అనంతరం ఆ మృతదేహన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో మృగాళ్లు వెల్లడించారు. ఈ మేరకు ఎస్‌వోటీ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
Also Read : Pak Missile: దాల్ సరస్సులో పాక్ క్షిపణి శిథిలాలు.. ఎప్పటిదో తెలిస్తే షాక్!