/rtv/media/media_files/2025/09/23/uttar-pradesh-2025-09-23-16-40-40.jpg)
లవర్ కోసం కన్నతండ్రిని, తోడబుట్టిని సోదరులను ఓ తప్పుడు హత్య కేసులో ఇరికించాలనుకుంది ఓ కూతురుఅందుకు ఆమెకు ఆమె ప్రియుడు కూడా సహాయం చేశాడు. చివరకు కథ అడ్డం తిరగడంతో ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో చోటుచేసుకుంది. నిందుతులను స్వాతి, మనోజ్ లుగా గుర్తించారు. క్రైమ్ షోలు, డాక్యుమెంటరీలు చూసి ఈ స్కెచ్ వేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. స్వాతి కుటుంబం మనోజ్ తో ప్రేమ సంబంధాన్ని వ్యతిరేకించడమే కారణమని పోలీసులు విచారణలో తేల్చారు.
తినే ఆహారంలో నిద్ర మాత్రలు
మనోజ్‌ను రహస్యంగా కలవడానికి, స్వాతి తన కుటుంబ సభ్యులు తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపేదన్నారు. అ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించాలని స్కెచ్ వేసింది స్వాతి. అందుకు ప్రియుడు కూడా సరేనని అన్నాడు. సెప్టెంబర్ 17-18 తేదీలలోసమీపంలోని గ్రామానికి చెందిన పెయింటర్ యోగేష్ ఒక స్మశానవాటిక సమీపంలో చనిపోయి కనిపించాడు. యోగేష్‌కు వీరిద్దరూ మొదట మద్యంలో నిద్రమాత్రాలు కలిపి, ఆపై ఇటుకతో దారుణంగా దాడి చేసి చంపేశారు.
హత్య చేయడానికి ఉపయోగించిన ఇటుకను కూడా సంఘటనా స్థలంలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిందితులు యోగేష్ ఫోన్ ఉపయోగించి స్వాతి తండ్రి, సోదరులపై దాడి జరిగిందని ఆరోపిస్తూ 112 కు కాల్ చేశారు. అయితే పోలీసులు దీనిపై యోగేష్ వాంగ్మూలంగా తీసుకుంటారని ఆశించారు. చివరకు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా.. యోగేష్ శవమై కనిపించాడు.
యోగేష్ ను స్వాతి తండ్రి, సోదరులే హత్య చేశారని పోలీసులు భ్రమపడాలని నిందితులు స్కెచ్ వేశారు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కాల్ రికార్డ్స్ చెక్ చేసిన పోలీసులకు అంతకుముందు యోగేష్ మాట్లాడిన కాల్ వాయిస్ కు, ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడిన వాయిస్ కు సరిపోకపోవడంతో తమదైన స్టైయిల్ లో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఫైనల్ గా స్వాతి, మనోజ్ లను దోషులుగా తేల్చారు. నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read : Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు బిగ్ షాక్.. రష్యా మరో సంచలన వ్యూహం