TG Crime: కామారెడ్డిలో అమానుషం.. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని గొడ్డులా బాదిన కానిస్టేబుల్!
కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణ రహింతగా కొట్టారు. వీడియో వైరల్ కావడంతో వారిద్దరినీ వెంటనే ఎస్పీ రాజేష్ సస్పెండ్ చేశారు.