/rtv/media/media_files/2025/03/27/UWRI3bZVB7kyo4JurqXG.jpg)
UP Shahjahanpur Man kills his 4 children and hangs himself
యూపీలోని షాజహాన్పూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్రంగా గొడవపడ్డాడు. అనంతరం ఆ కోపాన్ని తన పిల్లలపై చూపించాడు. రక్తబంధంతో పుట్టిన తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆపై రాజీవ్ కతేరియా కూడా తన భార్య చీరతో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అయితే చనిపోయిన పిల్లలంతా 5 నుంచి 13 ఏళ్ల లోపు వారేనని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో రాజీవ్ కతేరియా (36), తన భార్య కంతీదేవితో రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్పూర్ చాచారిలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. వీరి వయస్సు 5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే నిందితుడు చాలా కాలం క్రితం ఒక ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఆ తర్వాత అతను ప్రతి చిన్న విషయానికి భార్య, పిల్లలపై కోపగించుకునేవాడని సమాచారం.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
ఇందులో భాగంగానే ఓ విషయంలో భార్య, భర్తల మధ్య ఓ గొడవ వచ్చింది. దీంతో మృతుడి భార్య రెండు-మూడు రోజుల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. దాని కారణంగా అతడు మరింత కోపగ్రస్తుడయ్యాడు. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ కోపంలోనే అతడు తన నలుగురు పిల్లల్ని కత్తితో గొంతు కోసి.. ఆ తర్వాత అతడు తన భార్య చీరతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
అనంతరం రాజీవ్ తండ్రి ఇంటి తలుపు పగలగొట్టి లోపలికెల్లి చూసేసరికి.. పిల్లల మృతదేహాలు మంచం మీద పడి ఉన్నాయి. అలాగే రాజీవ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత ఎస్పీ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
(crime news | murder | latest-telugu-news | telugu-news | Latest crime news)
Follow Us