క్రైం Bangladesh: భారత్ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు! రాజకీయ సంక్షోభంతో కుదేలవుతున్న బంగ్లాదేశ్‌పై ప్రకృతి విరుచుకుపడుతోంది. వానలు, వరదలతో బంగ్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే భారత్ వల్లే వరదలు సంభవించాయని కొందరు బంగ్లాదేశీయులు ప్రచారం చేస్తున్నారు. దీంతో వంకర బుద్ధి పోనిచ్చుకోలేదంటూ భారతీయులు మండిపడుతున్నారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం! నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్ చేశారని ఆరోపించింది. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mutton fight: ముక్కల కోసం బొక్కలు ఇరగొట్టుకున్నారు.. పెళ్లి విందులో మటన్ పంచాయితీ! పెళ్లి విందులో మటన్ ముక్కలకోసం వరుడు, వధువు బంధువులు చావబాదుకున్న సంఘటన నిజమాబాద్ జిల్లా నవీపేటలో చోటుచేసుకుంది. వరుడి స్నేహితులు మాంసాహారం వడ్డించడంతో గొడవ మొదలైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు. గాయపడ్డవానిరి ప్రభత్వ ఆస్పత్రికి తరలించి 18 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ప్రేమోన్మది దాడిలో మరో యువతి బలి! హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో దీపన తమాంగ్ (25) అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు రాకేశ్ కూడా ఆత్మహత్యాయత్నానికిప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam: అమెరికాలో ఇచ్చాపురం యువకుడి దుర్మరణం! అమెరికాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన యువకుడు రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడు. స్నేహితులతో కలిసి లేక్ వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగుతున్న క్రమంలో అదుపు తప్పి లేక్ లో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ స్నేహితులు అతనిని కాపాడలేకపోయారు. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. పెట్రోల్ కోసం కాల్చేశాడు..! హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జీడిమెట్లలో పెట్రోల్ కోసం ఓ బైకర్పై కాల్పులు జరిపారు దుండగులు. తమ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో అటుగా వస్తున్న మరో బైక్‌లో పెట్రోల్ చోరీకి యత్నించారు. బైక్ ఓనర్ అడ్డుకోవడంతో మల్లంపేట్‌కు చెందిన నరేష్ అతనిపై కాల్పుడు జరిపాడు. By Archana 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: చిన్నారులను పీక్కుతింటున్న తోడేళ్లు.. 9 మంది మృతి, 30 మందికి గాయాలు! తోడేళ్ల బెడదతో ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. చిన్నారులే టార్గెట్‌గా వేటాడుతుండగా రాత్రి పిల్లలను చీరలతో కట్టేసుకుంటున్నారు తల్లులు. తోడేళ్లకోసం ఫారెస్టు అధికారులు గాలిస్తున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata: బెంగాల్ బంద్‌లో చెలరేగిన హింస.. బీజేపీ నేతపై కాల్పులు! కోల్‌కతా రణరంగంగా మారింది. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు నిరసనగా టీఎంసీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. పాండే డ్రైవర్‌కు గాయాలయ్యాయి. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..! నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చి తనకు పుట్టిన బిడ్డను రూ.10 వేలకు అమ్ముకుంది. వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ కావడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn