/rtv/media/media_files/2025/11/17/ibomma-ravi-2025-11-17-10-32-14.webp)
Ibomma ravi
పైరసీ మాఫియా ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ ఈసీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ చేసింది. ఇప్పటికే ఐ బొమ్మ నిర్వహకుడు రవి బ్యాంక్ అకౌంట్లో రూ.3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.
విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వస్తున్నాయని విచారణలో తేలింది. నెలకు రూ.15 లక్షలు రూపాయలు క్రిప్తో వాలెట్ నుండి రవి NRE ఖాతాకు బదిలీ అవుతున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వీటిపై ఈడి దర్యాప్తు చేయనుంది. ఐ బొమ్మ, బెట్టింగ్ యాప్‌లకు మధ్య రెండు ట్రాఫిక్ డొమైన్లు ఉన్నాయని.. వాటిలో ఒకటి అమెరికా, మరొకటి అమీర్‌పేట్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయని తేలింది. వీటి ద్వారాలే రవిని పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Follow Us