Hidma Team: APలో 31 మంది మావోస్టులు అరెస్ట్.. 60 మంది హిడ్మా టీం ఆంధ్రాలోకి!

కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.

New Update
71 Maoists Surrender to Police in Chattisgarh

71 Maoists Surrender to Police in Chattisgarh

ఛత్తీస్‌ఘడ్‌లో ఆపరేషన్ కగార్‌తో వరుస ఎన్‌కౌంటర్లు(encounter), లొంగుబాట్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు మకాం మర్చారు. ఛత్తీస్‌ఘడ్ అడవులను వదిలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపుగా కదిలారు  మావోయిస్టు అగ్రనాయకులు. ఈక్రమంలో ఏపీ గ్రేహౌండ్స్ సెర్చ్ ఆపరేషన్‌లో మంగళవారం మోస్ట్ వాంటెడ్ మావో హిడ్మా(Hidma Team) ఎన్‌కౌంటర్ అయ్యాడు. భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన ఆరుగురు నక్సల్స్‌లో ఆయన ఒకరు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే 31 మంది మావోయిస్టులను ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read :  తిరుమల భక్తులకు అలర్ట్.. మారిన దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!

AP Police Arrest 31 Hidma Team Maoists

కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్(Maoists arrest in Andhra Pradesh) చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు. వారిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో వరుస కూంబింగ్ ఎన్‌కౌంటర్ల నేపద్యంలో సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు విజయవాడ వచ్చారు. 60 మంది హిడ్మా టీమ్ ఆంధ్రాలోకి ప్రవేశించినట్లు  ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. వారంతా విజయవాడ, కాకినాడ, వైజాగ్, విజయనగరం వైపు బృందాలుగా డివైడ్ అయినట్టు తెలుస్తోంది. 31 మందిలో 9 మంది దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యులు ఉన్నారట. పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు అంతా ఛత్తీస్ ఘడ్ వాసులే.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30-7.00గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఆయన మీడియాతో అన్నారు. ఎన్కౌంటర్ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి ఆయన వెల్లడించారు. గత రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని మహేశ్చంద్ర లడ్డా తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Also Read :  హిడ్మా మృతిపై అధికారిక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు