BUS ACCIDENT: ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్‌లోనే..!

కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుండి వస్తున్న స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.

New Update
_BUS ACCIDENT

BUS ACCIDENT

కాన్పూర్‌లో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు పిల్లలు సహా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారితో సహా ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ప్రయాణికుల ప్రకారం.. ‘‘స్లీపర్ బస్సు అకస్మాత్తుగా కుదుపుకు గురైంది. మార్గమధ్యలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై బోల్తా పడింది. ప్రమాదం తర్వాత, మేము దాదాపు 15-20 నిమిషాల పాటు బస్సులోనే చిక్కుకుపోయాము.  

వీడియో - క్లిక్

Also Read :  iBomma కేసులో ED ఎంట్రీ.. రవి ఖాతాలో వేల కోట్ల డబ్బు?

Kanpur Bus Accident

డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా నడుపుతుండటంతో అతను మద్యం సేవించినట్లు కనిపించాడు. బస్సు చాలా వేగంగా ఉండటంతో బోల్తా పడిన వెంటనే రోడ్డుపై 50 అడుగుల దూరం జారిపోయింది. బస్సు భాగాలు చాలా దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. బస్సు లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల మధ్య చిక్కుకుపోయారు. ఎవరూ లేని ప్రాంతం కావడంతో చాలా సేపు లోపల చిక్కుకుపోయం. 

మరొక వీడియో కోసం -క్లిక్

ప్రమాదం గురించి కొంతమంది ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సు అద్దాలను పగలగొట్టి, ప్రయాణికులను విడిపించగలిగారు. క్షతగాత్రులను రక్షించడం పోలీసులకు సవాలుగా మారింది. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు సీట్లను కోసి, చాలా కష్టంతో ప్రయాణికులను విడిపించారు.’’ అని ప్రయాణికులు తెలిపారు. 

Also Read :  Minor Girl Marriage: వీడసలు తండ్రేనా.. మైనర్ కూతుర్ని తాగుబోతుకు అమ్మేశాడు..!

Advertisment
తాజా కథనాలు