pregnant Women : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల గర్భిణి మృతి!

సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.

New Update
women (1)

సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి. సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.  ఆమె తన రెండవ బిడ్డను స్వీకరించడానికి కొన్ని వారాల దూరంలో ఉండగా.. ఈ ఘటన జరగడం అందర్ని కలిచివేసింది. 

ఇంతకు ఏం జరిగిందంటే.. వీరు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అటువైపుగా ఓవచ్చిన ఓ కియా కార్నివాల్ కారు డ్రైవర్ వారికి దారి ఇచ్చేందుకు వేగాన్ని తగ్గించారు. సరిగ్గా అదే సమయంలో, వెనుకవైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఒక BMW సెడాన్, కియా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కియా కారు అమాంతం ముందుకు దూసుకుపోయి, రోడ్డు దాటుతున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

యువకుడిని పోలీసులు అరెస్ట్

సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమన్వితకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను, ఆమె గర్భస్థ శిశువును కాపాడటానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం దక్కలేదు. తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదానికి కారణమైన BMW కారును నడుపుతున్న ఆరోన్ పాపజోగ్లూ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కియా కార్నివాల్ నడుపుతున్న 48 ఏళ్ల వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ప్రమాదంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు