Kerala : రేబిస్ కలకలం.. ఏడేళ్ల బాలిక మృతి
కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం.
కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు గర్భవతికి ఆపేషన్ చేయగా.. కవల శిశువులు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో దారుణం జరిగింది. టెంపుల్ నుండి తిరిగి ఇంటికి వెళ్తుండగా స్కూటర్ పై నుండి గుంతలో పడి దంపతులు మృతి చెందారు. ఈ ఘటనలో వారి కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతూ చికిత్స పొందుతుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన మహిళకు వీడియోకాల్ చేసి బెదిరించిన కేటుగాళ్లు రూ.26 లక్షలు కాజేశారు. బాధిత మహిళ అకౌంట్ నుంచి ఇల్లీగల్ లావాదేవీలు జరిగాయని బెదిరింపులకు దిగారు. సదరు మహిళను అరెస్ట్ చేస్తామని భయపెట్టి విడతల వారిగా రూ. 26 లక్షల 50 వేలు కొట్టేశారు.
తమిళనాడులో డీఎంకే ఎంపీ ఏ రాజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా లైట్ స్టాండ్ అతడిపై కూలింది. ముందుగానే అతడు దానిని గ్రహించడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.
సంగారెడ్డి జిల్లా మల్కపూర్లో విషాదం చోటు చేసుకుంది. సుభాష్ అనే వ్యక్తి భార్య మంజుల మీద ఉన్న కోపంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని చనిపోయాడు. వివాహేతర సంబంధం నపథ్యంలో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
హైదరాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్లో ఉంటూ ఓ కుక్కను పెంచుకుంటున్న పవన్ కుమార్.. దాని చేతిలోనే హతమయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. పవన్ మర్మాంగాలు కొరికిన ఆనవాలు కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.
తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. వడపళనిలో రూ.20 కోట్ల విలువైన వజ్రాలను నలుగురు వ్యక్తుల ముఠా దోచుకెళ్లింది. వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు ఇచ్చేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. శివకాశి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు.