MPకి తప్పిన పెను ప్రమాదం.. జర్రుంటే సచ్చిపోతుండే రా - వీడియో వైరల్

తమిళనాడులో డీఎంకే ఎంపీ ఏ రాజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా లైట్ స్టాండ్ అతడిపై కూలింది. ముందుగానే అతడు దానిని గ్రహించడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.

New Update
dmk mp a raja narrowly escapes injury as stage lights collapse during public meeting

dmk mp a raja narrowly escapes injury as stage lights collapse


తమిళనాడులో డీఎంకే ఎంపీ ఏ రాజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ సభలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా లైట్ స్టాండ్ అతడిపై కూలింది. ముందుగానే అతడు దానిని గ్రహించడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

తృటిలో తప్పిన ప్రమాదం

ఆదివారం సాయంత్రం తమిళనాడులోని మైలాడుతురై ప్రాంతంలో ప్రజా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన డీఎంకే ఎంపీ రాజా తన ప్రసంగాన్ని వినిపించారు. అలా మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా బీభత్సమైన గాలి లేచింది. దీంతో ఆ వేదిక ముందు ఉన్న లైట్ స్టాండ్ ఆ గాలి కారణంగా కిందికి కూలింది. 

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

అది సరిగ్గా వేదికపై ఎంపీ రాజా మాట్లాడుతున్న ప్లేస్ వైపే పడింది. అయితే దీనిని ముందుగానే గ్రహించిన ఎంపీ రాజా ఆ పెను ప్రమాదం నుంచి సైడుకు తప్పుకున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న నాయకులంతా అలెర్ట్ అయ్యి.. ఎంపీ రాజాను పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డీఎంకే ఎంపీ రాజాకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో కార్యకర్తలు, నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. . . .

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

telugu-news | latest-telugu-news | dmk-mp-raja

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు