/rtv/media/media_files/2025/05/05/OICL7uk8n6exE7HTnXFY.jpg)
scooter accident
తమిళనాడులో దారుణం జరిగింది. టెంపుల్ నుండి తిరిగి ఇంటికి వెళ్తుండగా స్కూటర్ పై నుండి గుంతలో పడి దంపతులు మృతి చెందారు. ఈ ఘటనలో వారి కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతూ చికిత్స పొందుతుంది. నాగరాజ్ తన భార్య ఆనందితో పాటుగా 12 ఏళ్ల దీక్షయ అనే కూతురితో కలిసి తిరునల్లార్ ఆలయ దర్శనానికి వెళ్లారు. అయితే రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా.. నాగరాజ్ నడుపుతోన్న స్కూటర్ లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల వంతెన నిర్మాణం కోసం రోడ్డు పక్కన తవ్విన మూడు పెద్ద గుంతలను చూసుకోక అదుపుతప్పి అందులో పడిపోయారు.
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
Also read : India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
స్పాట్ డెడ్!
ఈ ఘటనలో నాగరాజ్, ఆనంది అక్కడికక్కడే మరణించారు. ధీక్షయకు గాయాలు అయ్యాయి. గాయపడిన బాలికను కుండడం పోలీసులు రక్షించి, తదుపరి చికిత్స కోసం కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ధరపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన ప్రయాణికులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, గుంత తవ్వకం స్థలం చుట్టూ హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు లేకపోవడాన్ని ప్రయాణికులు అధికారులను ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేస్తూ వైద్య చికిత్స కోసం రూ. లక్షతో పాటు రూ. 6 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Also read : Info Leak : తూ.. ఏం మనుషులార్రా.. పాక్కు భారత్ సమాచారం లీక్.. ఇద్దరు అరెస్ట్!
Also Read : PM Modi: ఆర్మీ సూట్‌లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్