SCO Summit: ఏదో జరగబోతోంది.. చైనా ప్రధానికి ఇష్టమైన కారు మోదీకి కేటాయింపు

షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు చైనా  వెళ్లిన మోదీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. అధికారిక పర్యటనల కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉపయోగించే 'మేడ్ ఇన్ చైనా' కారు అయిన హోంగ్కీ L5 ని మోడీకి కేటాయించింది.

New Update
SCO summit in China

SCO summit in China

ఇండియా ప్రధాని మోదీ(PM Modi) చైనాలో జరుగుతున్న SCO సదస్సు(SCO Summit) లో పాల్గొంటున్నారు. షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు చైనా  వెళ్లిన మోదీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. అధికారిక పర్యటనల కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉపయోగించే 'మేడ్ ఇన్ చైనా' కారు అయిన హోంగ్కీ L5(Hongqi L5 Car) ని మోడీకి కేటాయించింది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన ఈ సదస్సులో పాల్గొనడానికి మోడీ చైనా వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన వినియోగం కోసం చైనా ప్రభుత్వం ఈ ప్రత్యేక వాహనాన్ని అందించింది. హోంగ్కీ, చైనాలో 'రెడ్ ఫ్లాగ్' అని కూడా పిలువబడుతుంది. ఈ కారును చైనా కమ్యూనిస్టు పార్టీలోని ఉన్నత వర్గాల కోసం 1958లో తయారు చేయడం ప్రారంభించారు. అప్పటినుండి, ఇది చైనా జాతీయ గర్వానికి చిహ్నంగా మారింది.

Also Read :  UPSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక నిర్ణయం

SCO Summit Hongqi L5 Car

షీ జిన్‌పింగ్ ఈ కారును తమ దేశంలో తయారు చేసిన వాటికి ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో అంతర్జాతీయ సమావేశాలకు, అధికారిక పర్యటనలకు తరచూ ఉపయోగిస్తారు. 2019లో తమిళనాడులోని మహాబలిపురంలో మోడీతో అనధికారిక సమావేశం కోసం వచ్చినప్పుడు కూడా షీ జిన్‌పింగ్ ఇదే మోడల్ కారును ఉపయోగించారు. ఈ చర్య భారత్-చైనా సంబంధాలలో ఒక సానుకూల పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మోడీ చైనాలో ఏడు సంవత్సరాల తర్వాత అడుగుపెట్టడం, అలాగే ఈ సదస్సులో షీ జిన్‌పింగ్‌(President Xi Jinping) తో ఆయన సమావేశం కావడంతో, సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read :  తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI

Advertisment
తాజా కథనాలు