/rtv/media/media_files/2025/10/05/phsco-2025-10-05-11-32-51.jpg)
విజయవాడ(vijayawada) ఊర్మిళనగర్‌లో ఘోరం జరిగింది. వృద్ధురాలి సొంత అక్క కొడుకు ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు(Elder Brother Kills Minor Girl). తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు కనబడలేదని భవానీపురం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : Rohit Sharma : ముందే ఊహించాడు.. 13 ఏళ్ల కిందే చెప్పేశాడు... రోహిత్ పాత ట్వీట్ వైరల్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు .. భవానీపురం ఊర్మిళనగర్ లో నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి దంపతులకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వెళ్లిపోవడానికి కారణం పిన్నినే అని తెలుసుకొని ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు.
Also Read : గాయకుడు జుబీన్ గార్గ్ మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..
మాయమాటలు చెప్పి బాధితురాలిని
దీంతో ఆమెను హత్య(murder) చేయాలనీ ప్లాన్ చేశాడు. 2025 అక్టోబర్ 1వ తేదీన మాయమాటలు చెప్పి బాధితురాలిని బండిపై ఎక్కించుకొని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. అప్పటికే హత్య చేయడానికి సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధలతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం తల, కాళ్లు, చేతులు నరికి వాటిని గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు. అనంతరం అక్కడినుంచి నంద్యాలకు పారిపోయారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలి శరీర భాగాలను సేకరించారు.. కానీ, కాళ్లు మాత్రం లభించలేదు. ఈ హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
కేవీబీ పురంలో దారుణ ఘటన
మరోవైపు తిరుపతి జిల్లా కేవీబీపురంలో దారుణ ఘటన జరిగింది. అల్లుడితో అక్రమసంబంధానికి అడ్డుగా ఉందని..15 ఏళ్ల కూతురుపై రోకలి బండతో దాడి చేసింది తల్లి. 5 నెలల క్రితం 18ఏళ్ల యువకుడితో బాలిక ప్రేమవివాహం జరగగా.. భర్త చనిపోవడంతో కూతురు, అల్లుడుతో ఉంటుంది తల్లి. కొన్నాళ్లుగా అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈక్రమంలో అత్తతో పెళ్లికి సిద్ధమైయ్యాడు అల్లుడు. భార్య ముందే అత్త మెడలో తాళి కట్టేందుకు భర్త యత్నించగా.. భర్తను అడ్డకునేందుకు ప్రయత్నించింది బాలిక. ఈ క్రమంలో కోపంతో రోకలిబండతో బాలిక తల్లి, భర్త ఆమెపై దాడికి దిగారు. బాలిక అరుపులు, కేకలు విని స్థానికులు రక్షించారు. అత్త,అల్లుడికి స్థానికుల దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.